తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనుముల రేవంత్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు దిమ్మతిరిగే షాకిచ్చారు. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ మారుస్తారు అని వార్తలు వస్తున్న సంగతి విదితమే. టీపీసీసీ చీఫ్ గా అనుముల రేవంత్ రెడ్డిని నియమిస్తారు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమిస్తే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చేశారు అంట సీనియర్ నేతలు. ఆ పదవీ ఇస్తే పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న మాకు అయిన కానీ పార్టీలో ఉన్న యువనేతలకు కానీ ఇవ్వాలి. అంతేకాని మమ్మల్ని కాదని మధ్యలో వచ్చిన రేవంత్ కు ఎలా ఇస్తారని రాష్ట్ర ఇంచార్జ్ కుంతీయాను నిలదీశారు ఆ పార్టీ సీనియర్ నేతలు. దీంతో ఇప్పట్లో పీసీసీ చీఫ్ మార్పుండదని తేల్చేశాడు కుంతీయా.