తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రంను రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రం తరువాత వాస్తున్న సినిమా ఇది. అందుకే ఆయన దర్శకత్వంలో సినిమా అనగానే అంచనాలు పీక్స్‌లో వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు వీరి పాత్రలకు సంబంధించిన ఎటువంటి పోస్టర్స్‌ను విడుదల చేయలేదు.తాజాగా ఎన్టీఆర్ కొమురం భీం లుక్‌ను రివీల్ చేయబోతున్నారని తెలుస్తుంది. అక్టోబర్ 22న కొమురం భీం జయంతి ఉంది. ఆ సందర్బంగా ఎన్టీఆర్ లుక్‌ను రివీల్ చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.