టాలీవుడ్ హీరో,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిమానుల అత్యుత్సాహంతో పోలీసు గాయపడిన ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా దిండి రిసార్ట్స్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది.
దిండి రిసార్ట్స్ ముఖద్వారం వద్ద పవన్ అభిమానులు అత్యుత్సాహంతో ముందుకు తోసుకురావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో అక్కడే విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ గాయపడ్డారు.
చికిత్స కోసం ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పవన్ అభిమానుల ఓవర్ యాక్షన్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.