Home / UPDATES / ముగిసిన గ్రామ సవివాలయ రాత పరీక్షలు ఎన్ని లక్షల మంది రాసారంటే…!

ముగిసిన గ్రామ సవివాలయ రాత పరీక్షలు ఎన్ని లక్షల మంది రాసారంటే…!

ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలు నిన్నటితో అంటే సెప్టెంబర్ 8 వ తేదీ ఆదివారంతో ముగిసాయి. సెప్టెంబర్ 1 నుంచి 11 రకాల పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించారు. గ్రామ సచివాయం పోస్టులు మొత్తం 1,26,728 కాగా, 21,69,529 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రాతపరీక్షలకు మాత్రం 19,49,218 హాజరయ్యారు. సరాసరిన 89.84 శాతం హాజరయ్యారు. ఈ రాత పరీక్షల నిర్వహణకు ఏపీ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనరేట్‌ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. రాత పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌కు అవకాశం లేకుండా ఏపీపీఎస్సీ పరీక్షల తరహాలో నాలుగు సిరీస్‌లో ప్రశ్నాపత్రాలను రూపొందించారు. పరీక్ష జరిగిన రోజే ప్రశ్నపత్రాలకు ‘కీ’ని సాయంత్రానికి కల్లా వెబ్‌సైట్లో పెట్టి.. ఎన్ని మార్కులు వచ్చాయో అభ్యర్థులు సరిచూసుకునే అవకాశం కల్పించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల రాతపరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులు త్వరలోనే రిజల్ట్స్ ప్రకటించేందుకు సమాయాత్తం అవుతున్నారు. అయితే రాతపరీక్షలకు హాజరైన అభ్యర్థుల శాతం చూస్తే..ఒక్కో పోస్టుకు భారీగా పోటీ నెలకొందని చెప్పక తప్పదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat