యాషెస్ సిరీస్ లో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగవ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించి. ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది స్టీవ్ స్మిత్..అయినప్పటికీ అందరికన్నా ఎక్కువగా సంతోషించే ప్లేయర్ ఒకరు ఉన్నారు. అతడే ఆస్ట్రేలియన్ స్పిన్నర్ నాథన్ లయన్. వీరిమధ్య జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయ తీరాల వరకు వచ్చి చివరికి బెన్ స్టోక్స్ దెబ్బకు ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఒకరు చేసిన తప్పిదం వల్ల జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. అతడే లయన్..ఒక మిస్ ఫీల్డ్ వల్ల మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అలాంటి వ్యక్తి నిన్న విజయంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.