Home / BUSINESS / బంగారం కొనుక్కునే వారికి గుడ్‌న్యూస్…ఒక్క రోజే భారీ తగ్గింపు

బంగారం కొనుక్కునే వారికి గుడ్‌న్యూస్…ఒక్క రోజే భారీ తగ్గింపు

వరుసగా పెరుగుతూ రికార్డు సృష్టించిన పసిడి ధర ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. నిన్న ఒక్క రోజే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1500 తగ్గింది. ఢిల్లీలోని స్పాట్‌ మార్కెట్లో నిన్న రూ.39,225కు 10 గ్రాముల మేలిమి బంగారం అమ్ముడుపోయింది. ఎంసీఎక్స్ ట్రేడింగ్‌లో కూడా బంగారం ధర పతనమైంది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు అర శాతం తగ్గి… 38 వేల 300 రూపాయలుగా ఉంది. గత వారం గోల్డ్ ఫ్యూచర్స్‌లో పది గ్రాముల బంగారం రూ.39,885 రూపాయలు పలికింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పతనమౌతోంది. నిన్న బంగారం ధర నెల రోజుల కనిష్టాని పడిపోయింది. ఔన్సు బంగారం ధర 1,494 డాలర్లకు దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో వారం రోజుల్లో 4 శాతానికి పైగా పసిడి ధర పతనమైంది. షేర్‌ మార్కెట్లు పంజుకోవడంతో బంగారం నుంచి పెట్టుబడులు మళ్లడమే దీనికి కారణం. వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. నిన్న ఒక్క రోజే 8 శాతం పతనమైంది. దీంతో కేజీ వెండి ధర 47 వేల 405 రూపాయలుగా ఉంది. బంగారం, వెండి ధరల పతనానికి అమెరికా డాలర్‌తో పోల్చితే రూపాయి బలపడడం కూడా ఓ కారణం. ఈ ఏడాది బంగారం ధర 20 శాతం వరకూ పెరిగింది. అయితే… ఇప్పుడు ధరలు దిగి వస్తుండడంతో రానున్న పండగ సీజన్‌లో నగల అమ్మకాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు వ్యాపారులు. క్రమంగా పెరుగుతూ వచ్చి.. ఇప్పుడు తగ్గుముఖం పట్టడం.. బంగారం కొనాలని చూసేవారికి గుడ్‌న్యూసే మరి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat