Home / MOVIES / తన చెల్లి చూపించిన యువకుడిని లవ్ చేసిన హీరోయిన్ తాప్సీ.. పెళ్లి ఎప్పుడో తెలుసా

తన చెల్లి చూపించిన యువకుడిని లవ్ చేసిన హీరోయిన్ తాప్సీ.. పెళ్లి ఎప్పుడో తెలుసా

2010 వ సంవత్సరంలో వ‌చ్చిన ఝుమ్మంది నాదం చిత్రంతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైయ్యింది అందాల భామ తాప్సీ. ఈ సినిమా త‌ర్వాత మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌, వీరా, మొగుడు వంటి చిత్రాల‌లో న‌టించింది. మరి కొన్ని రోజుల్లోనే బాలీవుడ్ చెక్కేసింది. హిందీలో మంచి క‌థాంశం ఉన్న చిత్రాల‌ని ఎంపిక చేసుకుంటూ స్టార్ స్టేట‌స్ అందుకుంది. అయితే కొన్నాళ్ళుగా తాప్సీ ప్రేమాయ‌ణంకి సంబంధించి ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది తాప్సీ. తన చెల్లి షగున్‌తో కలిసి ఓ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. తాను ప్రేమలో పడ్డానని ఇంతకాలానికి హీరోయిన్ తాప్సీ అంగీకరించింది. అయితే, పిల్లలను కనాలని అనుకున్నప్పుడు మాత్రమే వివాహం చేసుకుంటానని చెప్పింది. అంతేకాదు తన చెల్లెలి ద్వారా అతను పరిచయం అయ్యాడని, అతను నటుడు, క్రికెటర్ కాదని, ఈ ప్రాంతానికి చెందిన వాడే కాదని స్పష్టం చేసింది. తానేమీ రోజుల తరబడి జరిగేలా వివాహ వేడుకను జరుపుకోబోనని, కేవలం ఒక్క రోజులో తన వివాహం బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో జరుగుతుందని చెప్పింది. తన మనసుకు నచ్చిన యువకుడిని చూపించినందుకు చెల్లెలికి కృతజ్ఞతలు చెబుతూనే ఉంటానని తాప్సీ తెలిపింది.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat