నిన్న మోడీ పుట్టినరోజు సందర్బంగా ట్విట్టర్లో చాలామంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారిలో రాజకీయ నాయకులే కాకుండా, వివిధరంగాలవాళ్ళుకూడా విష్ చేశారు. ఈక్రమంలో సందట్లోసడేమియాలా మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. అయితే మోడి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే గత ఎన్నికల ముందు థర్డ్ ఫంట్ పెట్టినపుడు మోడీని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టిన మమతా బెనర్జీ, కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, వైఎస్ జగన్, కేసీఆర్, కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులందరికీ థాంక్ప్ చెప్పారు.
వీరిలో రాజకీయ నాయకులే కాకుండా సినిమావాళ్లు, క్రీడారంగం వాళ్ళు, కళాకారులూ కూడా ఉన్నారు. ఇంతమందికి రిప్లై ఇస్తూ ధన్యవాదాలు చెబుతున్న మోడీగారు చంద్రబాబును మాత్రం అస్సలు పట్టించుకోలేదు. సినిమావాళ్లలో అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, మహేశ్ బాబులకు కూడా మోడి రిప్లై ఇచ్చారు. ఇసుకలో కళాఖండాలు చేసే సుదర్శన్ పట్నాయక్ కు, క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కు కూడా ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు మోడీ. ఇంతమందికి రిప్లై ఇస్తూ ధన్యవాదాలు తెలిపినమోడీ, చంద్రబాబు ను మాత్రం లైట్ తీసుకున్నారు. ఇది చూసిన చంద్రబాబు అభిమానులు వాయ్యా సినిమా వాళ్లకు ఇచ్చిన విలువకూడా నీకు ఇవ్వడంలేదేందయ్యా వాయ్యా ఆంటూ ఫీలైపోతున్నారు.