Home / 18+ / ‘గద్దలకొండ గణేష్’ అలియాస్ ‘వాల్మీకి’ నిలిచిందా..?

‘గద్దలకొండ గణేష్’ అలియాస్ ‘వాల్మీకి’ నిలిచిందా..?

చిత్రం: గద్దలకొండ గణేష్ / వాల్మీకి

నటీనటులు: వరుణ్ తేజ్, పూజా హెగ్డే, ఆతర్వా, రవి

దర్శకత్వం: హరీష్ శంకర్

నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట

మ్యూజిక్: మిక్కీ జె మేయర్

విడుదల తేదీ: సెప్టెంబర్ 20

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కించిన చిత్రం  గద్దలకొండ గణేష్ / వాల్మీకి. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ నెల 20న చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో వరుణ్ నెగటివ్ రోల్ లో కనిపించనున్నాడు. అంతేకాకుండా వరుణ్ కి ఇదే మొదటి మాస్ సినిమా అని చెప్పాలి. అంతేకాకుండా రవి, ఆతర్వా  ఇందులో అలరించనున్నారు. డింపుల్ ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించింది.

ఇక కధ విషయానికి వస్తే ఆతర్వ (అభి) వర్ధమాన దర్శకుడు, ఇతను హింసాత్మక గ్యాంగ్‌స్టర్‌ను తయారు చేసి నిజ జీవిత గ్యాంగ్‌స్టర్‌ను కనుగొనాలని నిర్ణయించుకుంటాడు.ఎన్నో పరిశోధనల తరువాత, అభి క్రూరమైన గ్యాంగ్ స్టర్ గద్దలకొండ గణేష్ గని (వరుణ్ తేజ్) తయారు చేసి సినిమా చేయాలనుకుంటున్నారు. మరి ఇందులో అభి విజయవంతమవుతుందా? తర్వాత ఏమి జరుగుతుంది? అనేదే కధ. చిత్రం లో మొదటిసారి వరుణ్ నెగటివ్ రోల్ లో చేయగా.. ఆ పాత్రకు తగ్గట్టుగా మంచి పెర్ఫార్మన్స్ ఇస్తాడు. ఇక ఆతర్వ ఈ చిత్రం తోనే టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. ఈ చిత్రంలో తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నట్టే. ఇక పూజా హెగ్డే మరియు రవి వారి పాత్రకు న్యాయం చేసారు. ఇక సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే హిట్ టాక్ అనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్:

*వరుణ్ తేజ్ పాత్ర

*ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్:

*రన్ టైమ్

* క్లైమాక్స్

రేటింగ్: 2.75/5

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat