Home / MOVIES / దాదాసాహెబ్ ఫాల్కే దాదా సాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ – 2019…విజేతలు వీరే…!

దాదాసాహెబ్ ఫాల్కే దాదా సాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ – 2019…విజేతలు వీరే…!

భారతీయ చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే 150 జయంతి సందర్బంగా దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ 2019 అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ విచ్చేయగా, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి పలువురు హీరోలు, హీరోయిన్లు, సినీ ప్రముఖులు, పలువురు టెక్నీషియన్లు హాజరయ్యారు. ఈ సందర్భగా విజేతలకు అవార్డుడు ప్రదానం చేసిన గవర్నర్ సౌందర్ రాజన్ ఈ సందర్భంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ మెంట్‌లో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ రోల్ గురించి ప్రసంగించారు. ఇక అవార్డుల విషయానికి వస్తే ప్రిన్స్ 2018లో వచ్చిన ‘భరత్‌ అనే నేను’ చిత్రానికి గానూ బెస్ట్ యాక్టర్‌గా మహేష్ బాబు‌కు అవార్డు దక్కింది.ఈ అవార్డ్‌ను తెలంగాణ గవర్నర్‌ తమిళసై చేతుల మీదుగా మహేష్ బాబు సతీమణి నమ్రత అందుకున్నారు. ఇక ప్రముఖ నటుడు మోహన్‌బాబు లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం అందుకున్నారు. అందాల బొమ్మ అనుష్కకు ‘భాగమతి’ సినిమాకుగాను ఉత్తమనటి అవా ర్డు గెల్చుకుంది. ఉత్తమ విలన్‌గా అరవింద్ సమేత చిత్రానికిగాను జగపతిబాబుకు అవార్డు దక్కింది. ఇక 2018లో అద్భుత విజయం సాధించిన రంగస్థలం చిత్రానికి దర్శకత్వం వహించిన సుకుమార్‌‌కు బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దక్కింది. బెస్ట్‌ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా రంగస్థలం చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు అవార్డులు అందుకున్నారు. ఇక మహానటి చిత్రానికి జాతీయ ఉత్తమనటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్‌కు అవుట్‌స్టాండ్ పర్‌ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెల్చుకోగా..పురుషుల విభాగంలో ఇదే అవార్డును కేజీఎఫ్ చిత్రానికి గాను యష్ అందుకున్నారు.

 

దాదాసాహెబ్ ఫాల్కే దాదా సాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ – 2019

బెస్ట్ యాక్టర్ – మహేష్‌బాబు (భరత్ అనే నేను)


బెస్ట్ యాక్ట్రెస్ – అనుష్క (భాగమతి)


బెస్ట్ డిబ్యూట్ (ఫిమేల్) – పాయల్ రాజ్‌పుత్ (RX 100 మూవీ)

బెస్ట్ డైరెక్టర్ – సుకుమార్ (రంగస్థలం)

 

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – దేవిశ్రీ ప్రసాద్ (రంగస్థలం)

 

బెస్ట్ సినిమాటోగ్రాఫర్ – రత్నవేలు (రంగస్థలం)

 

బెస్ట్ విలన్ – జగపతిబాబు (అరవింద సమేత)

 

అవుట్ స్టాండింగ్ పర్‌ఫార్మెన్స్  ఆఫ్‌ ది ఇయర్ (మేల్)  – యశ్ (కేజీఎఫ్)

 

అవుట్ స్టాండింగ్ పర్‌ఫార్మెన్స్ ఆఫ్‌ ది ఇయర్ (ఫిమేల్ )  – కీర్తి సురేష్ (మహానటి)

 

లైఫ్‌ టైమ్ అచీవ్‌‌మెంట్ అవార్డ్ – మంచు మోహన్‌బాబు