తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ” ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు గ్లోబల్ కంపెనీలకు తెలంగాణ రాష్ట్రం ఒక అడ్డంగా మారింది.
అసెంబ్లీలో జరిగిన కార్మిక శాఖ పద్దు గురించి మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కార్మిక శాఖ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ధనిక శాఖ అయింది. ఈ శాఖలో ఇప్పటి వరకు పదహారు వందల కోట్లు డిపాజిట్లు అయ్యాయి అని తెలిపారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా కార్మిక సంక్షేమం కోసం పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. కార్మికులకు ఉద్యోగ భద్రత,మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని”అన్నారు.