తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్,నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ మహానగరంలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో భేటీ కానున్నారు.
ఈ సమావేశంలో ముఖ్యంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న గోదావరి జలాలను తరలింపు విషయంపై చర్చించనున్నారు. శ్రీశైలానికి గోదావరి నీళ్లు తరలిస్తే అక్కడ నుంచి రాయలసీమకు పంపించే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు.
మరోవైపు కృష్ణా గోదావరి జలాలు సంపూర్ణ వాడకం.. 9,10వ షెడ్యూల్ సంస్థల విభజన అంశాలపై ఈ రోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరగనున్నది సమాచారం.