వరుస ఫ్లాపుల తరువాత దర్శకుడు పూరీ జగన్నాథ్ ఒక్క సినిమాతో పైకి లేచాడు. రామ్ పోతినేని హీరోగా, నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లు గా తెరకెక్కించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రాన్ని పూరీ, ఛార్మి కలిసి నిర్మించారు. అయితే ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో పూరీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడని తెలుస్తుంది. దాంతో ఇప్పుడు మంచి ఊపూమీద ఉన్న విజయ్ దేవరకొండ తో సినిమా తీయనున్నాడు. ఈ చిత్రానికి గాను ఫైటర్ అనే టైటిల్ కూడా నిర్ణయించాడు. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రంలో నభ నటేష్ ను హీరోయిన్ గా పెట్టాలని పూరీ ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే తన నటన, గ్లామర్ తో ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న ఈ భామకు ఇప్పుడు డేట్స్ కూడా కాళీలు లేవని తెలుస్తుంది.