తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల అక్టోబరులో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల బరిలోకి దిగడానికి అధికార ప్రతిపక్ష పార్టీలైన టీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి.
టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి,కాంగ్రెస్ తరపున ఎంపీ,టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి అయిన పద్మావతి రెడ్డిని బరిలోకి దించుతున్నట్లు ఆయా పార్టీలు ప్రకటించాయి.
కానీ తాజాగా ఈ ఉప ఎన్నికల బరిలో తాము దిగుతామంటూ ఏకంగా 251మంది సర్పంచులు తమ నామినేషన్లను దాఖలు చేయనున్నట్లు సర్పంచుల సంఘం ప్రకటించింది.