Home / ANDHRAPRADESH / తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు..కేంద్ర మంత్రులకు టీటీడీ ఛైర్మన్ ఆహ్వానం…!

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు..కేంద్ర మంత్రులకు టీటీడీ ఛైర్మన్ ఆహ్వానం…!

సెప్టెంబర్ 30 వ తారీఖు నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులుగా వివిధ వాహనాలపై దర్శన భాగ్యం కలిగించనున్నాడు. బ్రహ్మోత్సవాల సందర్భంగా  తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూల నుంచి ప్రముఖులు, భక్తులు లక్షలాదిగా తిరుమలకు తరలిరానున్నారు. టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సారథ్యంలో బ్రహ్మోత్సవాలలో  భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులకు స్వయంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానం పలుకుతున్నారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లను కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానపత్రిక అందజేశారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat