Home / ANDHRAPRADESH / తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి..!

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి..!

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధం అయింది. టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సారథ్యంలో ఈ నెల 30 వ తేదీ నుంచి అక్టోబర్ 8 వ తేది వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. దాదాపు రూ.7.53 కోట్లతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్నారు. దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి రానుండడంతో కట్టుదిట్టమైన భద్రతా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సారి నాలుగు మాడ వీధుల్లో సుమారు 2 లక్షల మంది భక్తులను అనుమతిస్తారు. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ఎలాంటి బ్రేక్‌ దర్శనాలు, ఆర్జిత సేవలు ఉండవు. ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే బ్రేక్‌ దర్శనం ఉంటుంది. అక్టోబర్‌ 4న జరిగే గరుడ వాహన సేవ రోజు ప్రొటోకాల్‌ దర్శనాలు కూడా ఉండవు. భక్తుల సౌకర్యార్థం ప్రతి ఒక్కరికి లడ్డూ అందించేలా ఏడు లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. 3 వేల మంది శ్రీవారి సేవకులు, 3,100 మంది పోలీసులు సంయుక్తంగా భద్రతా ఏర్పాట్లును పర్యవేక్షిస్తారు.బ్రహ్మోత్సవాల సమయంలో 2,200 ట్రిప్పులతో 2 లక్షల మందికి రవాణా సౌకర్యం కల్పించేందుకు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. బ్రహ్మోత్సవాలలో కీలకమైన గరుడ వాహనసేవ రోజు 3716 ట్రిప్పులు నడుపుతారు.గ్యాలరీల్లో భక్తులకు అన్న ప్రసాదం అందుబాటులో ఉంచుతున్నారు. భక్తుల కోసం పులిహోర, మంచినీళ్లు, మజ్జిక ప్యాకెట్లను లక్షలాదిగా అందుబాటులో ఉంచుతున్నారు. మొత్తంగా బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat