Home / LIFE STYLE / వారంలో నాలుగుసార్లు ఇలా చేస్తే.. బీపీ కంట్రోల్ అవుతుంది..!

వారంలో నాలుగుసార్లు ఇలా చేస్తే.. బీపీ కంట్రోల్ అవుతుంది..!

ప్రస్తుతం బిజీ బిజీ కాలంలో, మారిన ఆహార అలవాట్ల నేపథ్యంలో ప్రపంచ జనాభాలోని ప్రతి నలుగురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మన దేశంలో నగరాలు, పట్టణాలలో
70 శాతం మంది హై బీపీతో బాధపడుతున్నారు. మామూలుగా మనకు శరీరంలో బీపీ స్థాయిలు 120 – 80 ఉండాలి. అయితే శరీరం బరువు పెరగడం, మానసిక, శారీరక ఒత్తిడి, స్మోకింగ్, డ్రింకింగ్, క్రొవ్వు పదార్థాలు ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకుకోవడం వల్ల బీపీ స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. హై బీపీతో గుండెపోటుకు గురై మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. అయితే సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. గోధుమలు, బియ్యం, ఆకుకూరలు, పండ్లు, చేపలు, శరీరానికి తగినంత ఎక్స్‌ర్‌సైజ్‌లు చేస్తూ హైబీపీని అదుపులో ఉంచుకోవచ్చు. అయితే కొందరు జిహ్వాచాపల్యం చంపుకోలేక , ఇటు హైబీపీ అదుపులో పెట్టుకోలేక సతమతమవుతుంటారు. అయితే తాజాగా ఆహార నియమాలతో సంబంధం లేకుండా వారానికి 4- 7 సార్లు ఆవిరిస్నానం చేస్తే హైబీపీని కంట్రోల్ చేయవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. బీపీతో బాధపడే కొందరిని శాస్త్రవేత్తలు స్టీమ్‌ బాత్‌ చేయించి పరీక్షించగా…వారిలో రక్తపోటు నియంత్రణలోకి వచ్చినట్లు గుర్తించారు. వారానికి 2 నుంచి 3 సార్లు స్టీమ్ బాత్ చేసిన వారికి హైబీపీ 24 శాతం, వారానికి నాలుగు నుంచి 7 సార్లు చేయిన వారికి 46 శాతం రక్తపోటు తగ్గిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. చూశారుగా..డైలీ బీపీ టాబ్లెట్ వేస్తూ మందులు వాడుతూ…చప్పిడి తిండి తింటూ సతమతమయ్యే వారు ఇలా వారానికి 4 -7 సార్లు స్టీమ్ బాత్‌ చేస్తే హైబీపీ కంట్రోల్‌లోకి వస్తుంది.ఇంకెందుకు ఆలస్యం..డైలీ స్టీమ్ బాత్ చేయండి..కుదరకపోతే వారంలో నాలుగుసార్లు అయినా స్టీమ్‌బాత్ చేయండి..బీపీని అదుపులో ఉంచుకోండి..ఓకేనా.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat