ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా జగన్ ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ మాట్లాడినా ఆయన అభిమానులు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. అలాగే జగన్ కు సంబంధించి ఇప్పటికే ఆయనకు సంబంధించిన ఎన్నో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. జగన్ ఎన్ సీసీ ఫొటోలు, చిన్ననాటి ఫొటోలు కనిపించాయి.
తాజాగా జగన్ తన స్నేహితుడి పెళ్లిలో క్రింద కూర్చొని మాట్లాడుతున్న ఫొటో బయటకు వచ్చింది. జగన్ ఇన్ షర్ట్ చేసుకున్నారు. పెళ్లికొడుకుతో నవ్వుతూ ఆప్యాయతతో మాట్లాడుతున్నారు. బహుశా ఇది జగన్ చదువులు పూర్తి చేసుకున్న తర్వాత వ్యాపారంలో ఉన్నపుడు తన స్నేహితుడి పెళ్లిలో దిగిన ఫొటోగా చెప్తున్నారు. ముఖ్యంగా జగన్ తండ్రి వైఎస్ అప్పటికే పెద్ద లీడర్ అయినా కనీసం ఎటువంటి గర్వం లేకుండా క్రింద కూర్చొని మాట్లాడుతుండడం జగన్ సింప్లిసిటీకి నిదర్శనంగా తెలుస్తోంది.