Home / ANDHRAPRADESH / బ్రేకింగ్…అచ్చెన్నాయుడుకు ఏపీ హైకోర్ట్ నోటీసులు…టీడీపీలో ఆందోళన…!

బ్రేకింగ్…అచ్చెన్నాయుడుకు ఏపీ హైకోర్ట్ నోటీసులు…టీడీపీలో ఆందోళన…!

టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడుకు హైకోర్ట్ షాక్ ఇచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టెక్కలి నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌పై స్వల్ఫ మెజారిటీతో గెలుపొందారు. కాగా అచ్చెన్నాయుడు ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని, ఆ‍యన ఎన్నికను రద్దు చేయాలంటూ..పేరాడ తిలక్ ఏపీ హైకోర్ట్‌లో పిటీషన్ వేశారు. తాజాగా ఈ పిటీషన్‌పై స్పందించిన హైకోర్ట్.. టెక్కలి అసెంబ్లీ సీటు ఎన్నికలో లోసుగులు ఉన్నాయని గ్రహించింది. ఈ మేరకు అచ్చెన్నాయుడితోపాటు,ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై అక్టోబర్ 17 లోగా స్పందించాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అచ్చెన్నాయుడితోపాటు కాంగ్రెస్, బీజేపీ, జనసేన, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థుల‌కు కూడా హైకోర్టు నోటీసులు పంపడం గమనార్హం. మొత్తంగా అచ్చెన్నాయుడు ఎన్నికల నిబంధనలు అతిక్రమించారని తెలుస్తోంది. ఇక పేరాడ తిలక్ వేసిన పిటీషన్‌లో అచ్చెన్నాయుడుకు సంబంధించి పలు విషయాలు హైకోర్ట్‌కు నివేదించారు. టెక్కలి నుంచి పోటీ చేసిన అచ్చెన్నాయుడు అఫిడవిట్‌లో తనపై నమోదు అయిన క్రిమినల్ కేసు వివరాలను పేర్కొనలేదని, అందువల్ల ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ పేరాడ తిలక్ హైకోర్ట్‌కు విన్నవించుకున్నారు. ఈ మేరకు 2017 వ సంవత్సరంలో జులై 21న అనంతపురం జిల్లా హీరేహల్‌లో అచ్చెన్నాయుడిపై క్రిమినల్ కేసు నమోదైందని హైకోర్ట్‌కు ఆధారాలు అందజేశారు. ఈ ఆధారాల ఆధారంగా టెక్కలి ఎమ్మెల్యేగా గెలుపొందిన అచ్చెన్నాయుడిని అనర్హుడిగా ప్రకటించాలని తిలక్ తన పిటీషన్‌లో కోరారు. ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్ట్..అచ్చెన్నాయుడికు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడి ఎమ్మెల్యే పదవిపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. దీంతో తెలుగు తమ్ముళ్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. మరి అచ్చెన్నాయుడి పదవి ఉంటుందా ..ఊడుతుందా తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat