Home / MOVIES / సైరా ఎలా ఉంది.. రివ్యూ

సైరా ఎలా ఉంది.. రివ్యూ

మూవీ : సైరా న‌ర‌సింహారెడ్డి
నిర్మాణ సంస్థ: కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ
తారాగణం : చిరంజీవి, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా,అమితాబ్ బ‌చ్చ‌న్‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చాసుదీప్, జ‌గ‌ప‌తిబాబు, , అనుష్క‌, ర‌వికిష‌న్‌, నిహారిక‌, బ్ర‌హ్మానందం, ర‌ఘుబాబు త‌దిత‌రులు

ర‌చ‌న‌: ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌, సాయిమాధ‌వ్ బుర్రా
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: రాజీవ‌న్‌
మ్యూజిక్ : అమిత్ త్రివేది
ఛాయాగ్ర‌హ‌ణం: ర‌త్న‌వేలు
కూర్పు: ఎ.శ్రీక‌ర్ ప్ర‌సాద్‌
నిర్మాత‌: కొణిదెల రామ్‌చ‌ర‌ణ్‌
ద‌ర్శ‌క‌త్వం: సురేంద‌ర్ రెడ్డి

చాలా రోజుల తర్వాత ఖైదీ నెం150 తో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ద‌గ్గ‌ర‌కు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి సినిమా లాంటి హిస్టారిక‌ల్ మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి చిరు
తనయుడు రామ్‌చ‌రణ్ నిర్మాతగా వ్యవహరించగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు . బిగ్ బి అమితాబ్‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చాసుదీప్‌, న‌య‌న‌తార‌, అనుష్క‌, త‌మ‌న్నా, జ‌గ‌ప‌తిబాబు ఇలా భారీ తారాగ‌ణంతో
ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌గాథతో వచ్చిన `సైరా న‌రసింహారెడ్డి` హిట్టా ఫట్టా అనే అంశం తెలుసుకుందామా ..?

అసలు క‌థ ఏమిటి ‌:
తొలి ఇండియన్ ఫ్రీడం ఫైట్ లో పాల్గొన్న ఝాన్సీ ల‌క్ష్మీబాయ్(అనుష్క‌) త‌న సైనికుల్లో స్ఫూర్తి నింప‌డానికి రేనాడు వీరుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌ను చెప్ప‌డంతో సినిమా ప్రారంభం అవుతుంది.దీనికంటే
ముందు అనగా 1847లో అప్పటి ఉమ్మడి ఏపీలోనీ రాయ‌ల‌సీమలోని ఉయ్యాల‌వాడ ప్రాంతానికి చెందిన పాలెగాడు న‌ర‌సింహారెడ్డి(చిరంజీవి). బ్రిటీష్ వారు ప‌రిపాల‌న‌లో ఉన్న ఈ ప్రాంతంలో 61 మంది పాలెగాళ్లు
ఉండేవారు..వారిలో న‌ర‌సింహారెడ్డి కూడా ఓ పాలెగాడు. తీవ్ర‌మైన క‌రువు వ‌చ్చిన‌ప్పుడు బ్రిటీష్‌వారు ఆ ప్రాంతంలోని రైతులు, వ్యాపారుల‌ను ప‌న్నులు క‌ట్ట‌మ‌ని వేధించ‌డం మొద‌లు పెడతారు. గురువు గోసాయి
ఎంక‌న్న(అమితాబ్ బ‌చ్చ‌న్‌) స్ఫూర్తితో బ్రిటీష్‌వారు చేసే అకృత్యాలు చూడ‌లేక న‌ర‌సింహారెడ్డి వారికి ఎదురుతిరుగుతాడు. ఈయ‌న‌కు అవుకు రాజు(కిచ్చాసుదీప్‌), రాజా పాండి(విజ‌య్ సేతుప‌తి), వీరా
రెడ్డి(జ‌గ‌ప‌తిబాబు) త‌దిత‌రులు అండ‌గా నిలుస్తారు. బ్రిటీష్‌వారికి ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి ఎలా ఎదిరించాడు. వారితో న‌ర‌సింహారెడ్డి ఎలాంటి పోరాటాలు చేశాడు. చివ‌ర‌కు ఆయ‌న్ని బ్రిటీష్‌వారు ఎలా బంధించి ఉరి
తీశారనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

కథ విశ్లేష‌ణ‌:
అరవై ఏళ్ల వయస్సులో ఒక యాక్ష‌న్ పార్ట్ ఉన్న స్వాతంత్ర్యోద్య‌మ నాయ‌కుడి సినిమాలో న‌టించ‌డం అంత సుల‌భం కాదు. కానీ మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పాత్ర‌లో అద్భుతంగా న‌టించాడు. చిరు
లుక్ చ‌క్క‌గా స‌రిపోయింది. ఇక యాక్ష‌న్ పార్ట్‌లో చిరు చేసిన స్టంట్స్ చూసి ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఇక ఎమోష‌న‌ల్ సీన్స్‌లోనూ అద్భుతంగా న‌టించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో చిరు న‌ట‌న అభినంద‌నీయం.
ఇక బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఉన్న కాసేపు కూడా త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు.

అవుకురాజు పాత్ర‌లో కిచ్చాసుదీప్, రాజా పాండి పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి, సిద్ధ‌మ్మ పాత్ర‌లో న‌య‌న‌తార‌, లక్ష్మీ
పాత్ర‌లో త‌మ‌న్నా, వీరారెడ్డి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు ఇలా అంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు త‌మ న‌ట‌న‌తో ప్రాణం పోశారు. ఇక సాంకేతికంగా చూస్తే.. ఒక స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడి సినిమాను అప్ప‌టి కాలానికి తగిన‌ట్లు
తెర‌కెక్కించ‌డం అంటే అంత సులువైన విష‌యం కాదు. అది కూడా చ‌రిత్ర‌లో క‌నుమ‌రుగైన ఓ స‌మ‌ర‌యోధుడి క‌థ‌ను రూపొందిన ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి, నిర్మాత రామ్‌చ‌ర‌ణ్‌ల‌ను అభినందించాలి. ముఖ్యంగా
రామ్‌చ‌ర‌ణ్ ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌లో కాంప్రమైజ్ కాలేదు. సినిమాలోని ప్ర‌తి స‌న్నివేశం ఎంతో రిచ్‌గా ఉంది.

ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి సినిమాను విజువ‌ల్ వండ‌ర్‌లా తెరకెక్కించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు సురేంద‌ర్ రెడ్డి చేసిన సినిమాలు వేరు సైరా న‌ర‌సింహారెడ్డి వేరు. సినిమాను ఆయ‌న శ‌క్తి మేర చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. అమిత్
త్రివేది సంగీతం, జూలియ‌స్ పేకియం నేప‌థ్య సంగీతం బావున్నాయి. ర‌త్న‌వేలుసినిమాటోగ్ర‌ఫీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌ర‌క్క‌ర్లేదు. ప్ర‌తి స‌న్నివేశాన్ని చ‌క్క‌గా త‌న కెమెరాలో బంధించాడు. ముఖ్యంగా యాక్ష‌న్
స‌న్నివేశాల‌ను కెమెరాలో చ‌క్క‌గా విజువ‌లైజ్ చేశాడు. గ్రెగ్ పావెల్‌, లీ విట్టేక‌ర్‌, రామ్ ల‌క్ష్మ‌ణ్‌లు అద్భుత‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను కంపోజ్ చేశారు.

హిస్టారిక‌ల్ మూవీని ఓ స్టార్ హీరో చేస్తున్న‌ప్పుడు అందులో కాస్త సినిమాటిక్ లిబ‌ర్టీని తీసుకోవ‌డంలో త‌ప్పులేదు. అయితే సైరా సినిమాలో ఆ లిబ‌ర్టీని కాస్త ఎక్కువ‌గా తీసుకున్న‌ట్లు క‌న‌ప‌డుతుంది. మూడు నాలుగు
తాలూకాలను పాలించే పాలెగాడు న‌ర‌సింహారెడ్డి. ఆయ‌న వేలాది మంది బ్రిటీష్ సైన్యాన్ని ఊచ‌కోత కోయ‌డం అన్న‌ట్లు చూపించారు. అలాగే న‌ర‌సింహారెడ్డి ఎక్కువ‌గా గొరిల్లా యుధ్ధానికి ప్రాధాన్య‌త ఇచ్చి పోరాటం చేశాడు.
నిజానికి న‌రసింహారెడ్డి భార్య సిద్ధ‌మ్మ ఆయ‌న బ్రిటీష్‌వారికి లొంగ‌క ముందే చ‌నిపోతుంది. కానీ సినిమాలో అలా చూపించలేదు.

ప్ల‌స్ పాయింట్స్‌:
-చిరు నటన
– కథ,కథనం,యాక్షన్ సీన్స్
– ఇంటర్వెల్ కు ముందు వచ్చే సీన్స్
– సాంకేతిక వర్గం మరియు నటీనటుల

మైన‌స్ పాయింట్స్‌:
– ఫస్టాప్ లో కాస్త నెమ్మదిగా ఉండటం

చివ‌ర‌గా.. సైరా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి ఔరా అన్పిస్తుంది.
రేటింగ్‌: 3.75/5

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat