Home / SLIDER / తెలంగాణ జాగృతి సంస్థపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక వీడియో సందేశం

తెలంగాణ జాగృతి సంస్థపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక వీడియో సందేశం

తెలంగాణ పల్లె జీవితాన్ని, ప్రకృతి రమణీయతను ఆవిష్కరించే అద్భుతమైన పండుగ బతుకమ్మ అని కితాబిచ్చిన ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.పువ్వుల్ని పూజించే విశిష్ట సంప్రదాయాన్ని స్వరాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఆయుధంగ, విడదీయలేని ఉద్యమరూపంగ మార్చిన ఘనత తెలంగాణ జాగృతి సంస్థదే అన్నరు.
 
దేశ, విదేశాల్లోని తెలంగాణ ఆడబిడ్డలు ఇవాళ సగర్వంగ బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి మాజీ ఎంపీ కవిత నాయకత్వంలో ఆనాడు జాగృతి చేసిన పోరాటమే కారణమన్నరు. నాటి సమైక్య పాలకులు ట్యాంక్ బండ్ పై బతుకమ్మను నిషేధించి తెలంగాణ ఆడబిడ్డలను అవమానిస్తే, హైకోర్టుకు వెళ్లి మరీ బతుకమ్మను సంబురంగా ఆడిన ఘన చరిత్ర జాగృతికి ఉందన్నరు.
 
సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్న బతుకమ్మ చీరలకు ప్రేరణ జాగృతే అన్నరు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన సోదరి కవిత, దశాబ్ద కాలంగా జాగృతిలో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారుఈ విషయాన్ని తెలంగాణ జాగృతి సంస్థ తన ట్విట్టర్ మరియు ఫేస్బుక్ లో తెలియచేసింది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat