Home / SLIDER / తెలంగాణలో 52,996 మంది జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు

తెలంగాణలో 52,996 మంది జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు

తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్ణిస్తున్న జర్నలిస్ట్ కాలనీ లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి హరీష్ రావు మొక్కలు నాటారు..ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ దేశంలో మరి ఎక్కడా లేని రీతిలో జర్నలిస్టుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తోంది.. తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులు సైతం కలిసివచ్చారు అదే భావనతో సీఎం కేసీఆర్ గారు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.. రాష్ట్రంలో 16,868 మందికి అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేశాం , అలాగే హెల్త్ కార్డులను కూడా జారీ చేసాం.. 12600 జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు మరో 38వేల మంది కలిపి 52,996 మందికి ఆరోగ్య కార్డులు ఇచ్చాము

.

జర్నలిస్టుల సంక్షేమానికి 100కోట్ల తో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశామని, మానవీయ రీతిలో ఆదుకుంటున్నాము..వివిద కారణాలతో మరణించిన రాష్ట్రంలో 220 మంది పాత్రికేయుల కుటుంబాలకు 2.25 కోట్లు మంజూరు చేశాముగాయపడిన వారికి, ఇతర అనారోగ్యాలకు గురైన వారికి 50వేలు చొప్పున అందింస్తూ , మరణించిన పాత్రికేయుల కుటుంబాలకు నెలకు 3వేలు చొప్పున పెన్షన్ అందిస్తున్నామని, వారి పిల్లల చదువులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నాము..ఐదు లక్షలు ప్రమాద బీమా పథకం కూడా అమలులో ఉంది.మన ఉమ్మడి జిల్లాలో 41 మంది జర్నలిస్టుల కు సహాయాన్ని అందించాం.. అందులో 21 మంది వివిధ కారణాలతో మరణించారు వారికి లక్ష చొప్పున ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు..

వారి కుటుంబానికి నెలకు 3వేల చొప్పున పెన్షన్ కూడా వస్తుంది.. పిల్లలు చదువులకు కూడా ఇస్తున్నాం..16 మంది గాయపడి, అనారోగ్య గురైన వారికి కూడా సహాయాన్ని అందించాం…4 గతంలో పని చేసి ఇప్పుడు వృత్తిలో లేని సీనియర్ జర్నలిస్టుల కు కూడా ప్రభుత్వం ద్వారా సహాయాన్ని అందించాం.. జర్నలిస్టు అంటే ఎండ..వాన..చలి అనేది లెక్క చేయకుండా వృత్తిని నమ్ముకుని సామాజిక బాధ్యతగా.. ప్రభుత్వం ఇటు ప్రజలకు వారధులు.. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి తెలియజేస్తు..ప్రజలకు ప్రభుత్వ పనితీరు ని తెలియజేయడం…నాటి ఉద్యమం.. నేటి సంక్షేమం లో మీ పాత్ర గొప్పది…జహీరాబాద్ జర్నలిస్టుల కాలనీ మోడల్ గా నిలవాలి… నాటిన మొక్కను సంరక్షించాలి..డబుల్ బెడ్రూం ఇళ్ళ ప్రారంభోత్సవం నాటికి ఇంటికి ఐదు మొక్కలు నాటాలి..వేప , తులసి, ఇతర పండ్ల మొక్కలు నాటాలి అని పిలుపునిచ్చారు…

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat