ప్రపంచమే గర్వించదగ్గ గొప్ప క్రికెటర్ స్థాయి నుంచి పాకిస్థాన్ దేశపు సైన్యం, ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మ అనే స్థాయికి దిగజారిపోయాడు అని మాజీ క్రికెటర్, పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై విమర్శల వర్షం కురిపించారు టీమిండియా మాజీ ఆటగాడు మహ్మాద్ కైఫ్.
ఇటీవల జరిగిన ఐరాస సర్వప్రతినిధి సభలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించిన తీరును గమనిస్తే ఒక గొప్ప ఆటగాడి నుంచి పాక్ సైన్యం, ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మ స్థాయికి ఎంతగా దిగజారారో ఆర్ధమవుతుందని మహ్మాద్ కైఫ్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు.
ఇప్పటికే టీమిండియా మాజీ కెప్టెన్,బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ,డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వగ్ కూడా ఇమ్రాన్ ఖాన్ పై విరుచుపడిన సంగతి విదితమే.