Home / ANDHRAPRADESH / జగన్ వస్తే కప్పు కాఫీతో సరి..చంద్రబాబు, లోకేష్‌‌లు వస్తే విందులు, వినోదాలా…!

జగన్ వస్తే కప్పు కాఫీతో సరి..చంద్రబాబు, లోకేష్‌‌లు వస్తే విందులు, వినోదాలా…!

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఏడాది క్రితం నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై విఐపీ లాంజ్‌లో జరిగిన హత్యా ప్రయత్నం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఎయిర్‌పోర్ట్ అనేది కేంద్రం పరిధిలో ఉంటుంది. కానీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో బాబుగారి సామాజికవర్గానికే చెందిన కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేవారు. ఎయిర్‌పోర్ట్ అధికారుల సహకారంతోనే నిందితుడు శ్రీనివాస్ కత్తితో జగన్‌పై దాడిచేయగలిగాడు అనడంలో సందేహం లేదు. ఎయిర్‌పోర్ట్ నిబంధనల మేరకు వీఐపీ లాంజ్‌లో ప్రతిపక్షనేత లేదా స్టేట్, సెంట్రల్‌ క్యాబినెట్‌ హోదా కలిగిన నేతలు వచ్చినప్పుడు కొద్దిసేపు అక్కడ విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పిస్తారు. ఆ సందర్భంలో టీ, స్నాక్స్‌కు మాత్రమే అనుమతిస్తారు. ఒకవేళ వీఐపీ.. భోజనం, అల్పాహారం తీసుకోవాలనుకుంటే ప్రొటోకాల్‌ అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు చేస్తారు. అదీ కేవలం వీఐపీకి మాత్రమే అనుమతిస్తారు. మిగిలిన వాళ్లు, వీఐపీ సహాయకులు సైతం పక్కనే ఉన్న రెస్టారెంట్‌లోకి వెళ్లాల్సిందే. ఎవరొచ్చినా ఈ మేరకే నిబంధనలు వర్తింపజేస్తారు. జగన్‌పై దాడి విషయంలో జరిగింది అదే.. విశ్రాంతి నిమిత్తం వీఐపీ లాంజ్‌లో ఉన్న జగన్ దగ్గరకు కాఫీ ఇచ్చే మిషతో నిందితుడు శ్రీనివాస్ కోడికత్తితో జగన్‌పై హత్యా ప్రయత్నం చేశాడు. అయితే జగన్ అప్రమత్తంగా ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే నిందితుడు శ్రీనివాస్ ఎయిర్‌పోర్ట్‌లోని రెస్టారెంట్‌లో పని చేస్తూ ఉంటాడు. ఈ రెస్టారెంట్ ఓనర్ హర్షవర్థన్ చౌదరి..చంద్రబాబు, లోకేష్‌లకు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. కట్ చేస్తే జగన్‌పై దాడి జరిగిన ఏడాది తర్వా త ఎయిర్‌పోర్ట్‌లో తాజాగా జరిగిన ఘటనలో అధికారుల తీరు వివాదస్పదంగా మారుతోంది.

విశాఖలో రెండురోజుల పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ వెళ్లేందుకు ఈనెల 11వ తేదీన శుక్రవారం రాత్రి 9గంటల సమయంలో చంద్రబాబు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు, స్పైస్‌ జెట్‌ విమానం బయలుదేరేందుకు సమయం ఉండటంతో వీఐపీ లాంజ్‌లో బస చేశారు. నిబంధనల ప్రకారం చంద్రబాబు ఒక్కరే వీఐపీ లాంజ్‌లో అల్పాహారం తీసుకోవాలి. కానీ ఆ రోజు దాదాపు 30 మంది వరకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పక్కనే ఉన్న ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ నుంచి బిర్యానీలు, నాన్‌వెజ్‌ కర్రీలు ఆర్డర్లు తెచ్చుకుని హల్‌చల్‌ చేసేశారు. ఇక ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ యజమాని, టీడీపీ నేత హర్షవర్ధన్‌ చౌదరి హడావుడికి అయితే అంతులేకుండా పోయింది. అక్కడే చంద్రబాబుకు పొర్లు దండాలు పెట్టిన హర్షవర్ధన్‌ టీడీపీ నేతలకు ఏది కావాలన్నా దగ్గరుండి సర్వీస్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తతంగాన్ని అడ్డుకోవాల్సిన ఎయిర్‌పోర్ట్‌ చీఫ్‌ సెక్యూరిటీ అధికారి(సీఎస్‌వో) వేణుగోపాల్‌ టీడీపీ నేతలకు మరింత ఊతమిచ్చేలా దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారన్న విమర్శలు వస్తున్నాయి.

ఇక అక్టోబర్ 11 , శుక్రవారం నాడు బాబు అండ్‌ కో చేసిన ఖర్చు ఇవ్వాలని రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌ చౌదరి అధికారులను కోరగా, అధికారులు మాత్రం ఆ బిల్లు తాము ఇవ్వలేమని చెబుతున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు 2017 నుంచి 2019 మార్చి వరకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు, లోకేష్‌బాబుల తినుబండారాల ఖర్చు సుమారు రూ.14లక్షల మేర బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. కాగా 2014 నుంచి 2017 వరకు వారిద్దరి తినుబండారాల ఖర్చు దాదాపు రూ.12లక్షల వరకు అధికారులు ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌కు చెల్లించారంటే ఏ మేరకు ఖర్చు చేశారో అర్ధం చేసుకోవచ్చు. ఈ వ్యవహారంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చినప్పుడు కలిసేందుకు వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలను కూడా నిలవరిస్తూ, అడ్డంకులు సృష్టిస్తున్న అధికారులు.. చంద్రబాబు, టీడీపీ నేతల విషయంలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. కేవలం ఎయిర్‌పోర్ట్‌లో లోకేష్‌బాబు తినుబండారాలు చెకోడీలు, చాక్లెట్లకే అన్ని లక్షలు ఖర్చు చేశారా… అని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో జరిగిన దుర్వినియోగానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. మొత్తంగా ఆ ఖర్చులపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మొత్తంగా అధికారం మారినా..విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు అనుకూల అధికారులు మాత్రం ఏం మారలేదు. సీఎం జగన్‌ దగ్గరకు ఒక్క వైసీపీ నేతను కూడా అనుమతించకుండా..కప్పు కాఫీ ఇచ్చి సరిపెట్టే పచ్చ అధికారులు..అదే ప్రతిపక్ష నాయకుడి చంద్రబాబు, ఆయన వంధిమాగధులకు మాత్రం ఏకంగా వీఐపీ లాంజ్‌లోకి బిర్యానీలు వండివారుస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం తీవ్ర వివాదస్పదంగా మారింది. ఇక ఎయిర్‌పోర్ట్‌లో కాసేపు రెస్ట్ తీసుకునే టైమ్‌లో ఏకంగా టీ, స్నాక్స్‌లకు చంద్రబాబు, లోకేష్‌లు లక్షలకు లక్షలు తగలేయడం పట్ల ప్రజల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. కేవలం చాక్లెట్లు, సమోసాలు, టీలకే ఇన్ని లక్షలు ఖర్చు అయ్యాయంటే బాబు, లోకేష్‌లు ఏ స్థాయిలో దుబారా చేశారా అర్థమవుతుంది. దుబారా చేయడమే కాదు..బిల్లుల పేరుతో తమ టీడీపీ నేత, రెస్టారెంట్ ఓనర్ హర్షవర్థన్ చౌదరికి నెలనెలా లక్షలకు లక్షలు కట్టబెట్టారనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ సర్కార్ ఈ విషయంపై ఫోకస్ పెడితే…పెద్ద అవినీతి బండారమే బయటపడేలా ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat