Home / EDITORIAL / ప్రజా సేవకులుగా.. ఉత్సాహంగా పని చేయాలి

ప్రజా సేవకులుగా.. ఉత్సాహంగా పని చేయాలి

రైతులకు సేవ చేయడం.. మనమెంతో అదృష్టంగా భావించాలి.! వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.! ఇందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం గొప్ప అడుగు వేసింది.! ఈ సమయంలోనే మీరు ఏఈఓలుగా ఈ కార్యక్రమంలో మీ భాగస్వామ్యులు కావడం మీ అదృష్టం.! మీరంతా యంగ్ స్టర్స్ వ్యవసాయ రంగంలో వచ్చే కొత్త కొత్త మార్పుల పై అవగాహన కలిగి ఉంటూ.., రైతుల్లో ఒక విశ్వాసాన్ని కలిగించాలి. సేంద్రీయ వ్యవసాయం పై ప్రజలలో చైతన్యం తేచ్చేలా రైతుల మనస్సు గెలుస్తూ.. ప్రజా సేవకులుగా.. ఉత్సాహంగా పని చేయాలని ఏఈఓలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గారు పిలుపునిచ్చారు.
 
సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి అధ్యక్షతన మంత్రి హరీశ్ రావు గారు సమక్షంలో సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు, ఫర్టిలైజర్స్, డీలర్లకు ప్రత్యేకంగా ధాన్యం కొనుగోళ్ల అంశంపై వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ-ఆత్మ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఈ యేటా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా పంట సాగు గణనీయంగా పెరగడం సంతోషకరమైన విషయమని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో తగు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ కొనుగోళ్లు కేంద్రాల్లో రైతులకు ఏలాంటి అసౌకర్యాలు కలుగకుండా కావాల్సిన సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోళ్ల కేంద్రాల్లో కొత్తగా విధులు నిర్వర్తిస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారులు కొనుగోళ్ల ప్రమాణాలకు అనుగుణంగా పంట కొనుగోళ్లు చేపట్టాల్సి ఉంటుందని, ఇందు కోసం ముందస్తుగానే గ్రామాల వారీగా రైతులకు అవగాహన కోసం తగు సూచనలు ఇవ్వాలని ఏఈఓలకు దిశానిర్దేశం చేశారు.నంగునూరు మండల క్లస్టర్ పరిధిలోని ఓ ఏఈఓతో మీ పరిధిలో ఎంత మంది రైతులు ఉన్నారని., వాన కాలం ఎంత సాగు చేశారని.. వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటల సాగుపై ఏఈఓ, ఏఓల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. రైతులను పేరు పెట్టి పిలువగలిగేలా పని చేస్తున్నారా..? అంటూ ప్రశ్నిస్తూ.. పది మంది రైతుల పేర్లు తెలపాలని ఏఈఓలను ప్రశ్నించారు.
 
వారు చెప్పిన రైతుల పేర్లలో ఎవరెవరు ఏమేమి పంటలు వేశారో.. క్షేత్రస్థాయిలోఖరీఫ్ సాగు విస్తీర్ణాన్ని ఏ విధంగా నమోదు చేశారో.. గ్రామాల వారీగా ఏఈఓలను మంత్రి ఆరా తీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక, వ్యవసాయ శాఖ చాలా ముఖ్యమైన శాఖగా మారిందని, గత ప్రభుత్వాలు రైతుకు ప్రాధాన్యత ఇవ్వలేదని, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చాక రైతుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మన ప్రభుత్వం వచ్చాక, చెరువుల పునరుద్ధరణ, పంటలు కొనుగోలు, గోదాములు, విద్యుత్‌, ప్రాజెక్టులు ఇలా ఈ రంగాలన్నీ రైతు శ్రేయస్సుకై పాటుపడుతాయని వివరించారు. వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులుగా క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పై ఆరా తీసి మీరంతా గట్టి పట్టుదలతో కసిగా పని చేయాలని మీ వద్ద ప్రతి రైతు వివరాలు ఉండాలని, రైతులతో మమేకమై వారితో సత్సంబంధాలు ఏర్పర్చుకోవాలని కోరారు. నీటి వనరులను ఆదా చేస్తూ.. జిల్లాలోని వ్యవసాయం రంగంలో పలు మెళుకువలు చెబుతూ.. మార్పులు, సంస్కరణలు తేవాలని దిశా నిర్దేశం చేశారు. మీ సెల్ ఫోన్, ట్యాబ్ లలో ప్రతీ రైతు వివరాలు ఉండాలని, వ్యవసాయ పరమైన సమస్యల విషయ వేదికలో మీ పాత్ర చాలా గొప్పదని ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని కోరారు. వ్యవసాయ శాఖ అంటే.. గ్రామం, రైతు అనే ఆలోచనతో పని చేయాలని, మేము చేస్తున్న పని ఎక్కడ అనేది కాదు, కేవలం వ్యవసాయ శాఖలో అన్నం పండించే రైతు పని చేస్తున్నామని గుర్తు పెట్టుకోవాలని కోరారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా మనస్సు నిబ్బరం చేసుకుని పని చేసి రైతుల మనస్సును గెలిచేలా తమ సేవలు ఉండాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నామని., కాదు ప్రజా సేవకులుగా ఉద్యోగం చేస్తున్నామని రైతు మనస్సును గెలువాలని ఏఈఓలకు మంత్రి హరీశ్ రావు దిశా నిర్దేశం చేశారు.
 
రైతుబంధు పథకానికి సంబంధించి మొదటి విడతకు, రెండవ విడతకు ఎంత మంది రైతులు పెరిగారని.., విస్తీర్ణం ఎంత పెరిగిందని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆరా తీశారు. అందరికీ రైతుబంధు పథకం అందుతుందా..? లేదా క్షేత్రస్థాయిలో విధి నిర్వహణలో ఏఈఓలు చేస్తున్న పనుల తీరుతెన్నులపై ఆరా తీశారు.జిల్లాలో ఎక్కడ తాను పర్యటించినా అక్కడి రైతులతో ముఖాముఖి నిర్వహించి మీ పని తీరు గురించి రైతుల వద్దనే సమాచారాన్ని తీసుకుంటానని తెలుపుతూ.. జిల్లాలో క్షేత్రస్థాయిలో గ్రామ, మండల రైతుల వారీగా పరిశీలన చేసి సమీక్షలు జరిపి తనకు, జిల్లా కలెక్టరుకు సమగ్ర నివేదికను రూపొందించి ఇవ్వాలని ఆదేశించారు.
 
జిల్లా వ్యవసాయ అధికారి మొదలుకుని సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఫర్టిలైజర్ల యాజమాన్య ప్రతినిధులు, ఇన్పుట్ డీలర్లను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధి విధానాలను పరిగణనలోకి తీసుకుని డీలర్లంతా రైతులకు సంబంధించిన ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉంటే.. రైతులకు అనుకున్న విధంగా మేలు జరుగుతుందని చెబుతూ.. వ్యవసాయ రంగంలో ఫర్టిలైజర్ల, డీలర్లదే ప్రత్యేకమైన పాత్ర అని చెప్పుకొచ్చారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నదని., 40 తరగతులలో 80 ప్రాక్టికల్ తరగతులు ఉంటాయని..మీరంతా అన్నీ తరగతులకు హాజరై అవగాహన పొందితే.. జిల్లా రైతాంగానికి మేలు చేసినవారమవుతామని ఫర్టిలైజర్లు, డీలర్లను మంత్రి కోరారు.
ఏంఆర్ పీ ధర కంటే ఎక్కువగా విక్రయాలు జరుపుతూ.. ఒక్కరిద్దరూ డీలర్లతో.. వ్యవస్థకు, అందరికీ చెడ్డ పేరు వస్తుందని.., ఓపిక, సహనంతో ఒక అడుగు ముందుకు వేసి రైతులతో మమేకమై మాట్లాడితే ఏ సమస్య అయినా పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
 
ఈ-పాస్ మిషనరీ ద్వారానే వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని సూచించారు. వీరికి వ్యవసాయ సాంకేతికత, విస్తరణ పట్ల వ్యవసాయ శాఖ వారి సమన్వయం, సౌజన్యంతో నిర్వహిస్తున్న డిప్లోమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ అను డిప్లమా కోర్సును నిర్వహిస్తున్నారని వివరించారు. ప్రస్తుతం 40 మంది జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇన్పుట్ డీలర్లు జిల్లా వ్యవసాయ కార్యాలయంలో ప్రతి ఆదివారం జరిపే శిక్షణా తరగతులకు హాజరై ఈ కోర్సు ద్వారా సాంకేతిక పరిజ్ఞానం పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి కొత్త బ్యాచ్ 40 మందితో జిల్లాలోని ఇన్పుట్ డీలర్లకు శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకించి రైతులు వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు, ఎరువులు క్రిమిసంహారక మందుల పై ఇన్పుట్ డీలర్లను సంప్రదిస్తున్నారని., ఈ విషయంలో మీరంతా ప్రత్యేక శ్రద్ధ వహించి నాణ్యమైన విత్తనాలను ఎరువులను క్రిమి సంహారక మందులను అధిక ధరలకు విక్రయించకుండా రైతుకు కొనుగోలుకు సంబంధించిన రశీదులను తప్పనిసరిగా పొందేలా వారికి అవగాహన కల్పిస్తూనే రశీదులను అందివ్వాలని ఆదేశించారు.
 
డీలర్లు కేవలం వ్యాపార ధోరణి లోనే కాకుండా రైతు శ్రేయస్సుకు తోడ్పడే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. ఏవరైనా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా చట్టాలు ఉల్లంఘించి నకిలీ విత్తనాలు, ఎరువులు, నకిలీ క్రిమిసంహారక మందులు అమ్మినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1950 కింద కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.రబీ సాగుకు రైతులకు అవగాహన కల్పించాలని., రబీ..యాసంగి పంటల్లో విత్తనాలు, ఎరువులు కొరత సిద్ధిపేట జిల్లాలో ఉండొద్దని వ్యవసాయ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. వారం రోజులు ముందుగానే ప్రణాళికలు రూపొందించుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదే విధంగా రైతులను ఆరుతడి పంటల వైపు ప్రోత్సహించాలని.. సూచిస్తూ.. ఏఈఓలు ఎప్పటికప్పుడు సేల్స్ మానిటరింగ్ చేయాలని., అనుభవంలో ఉన్న రైతులతో మమేకమై మాట్లాడి.. ఆరుతడి విధానంలో పంటలు పండిస్తున్న తీరుతెన్నులు గ్రహించి రైతులకు అవగాహన కల్పించాలని ఏఓ, ఏఈఒలను ఆదేశించారు.
 
 
 
రైతుబంధు పథకం కింద జిల్లాలోని 275 కోట్ల రూపాయలకు 229 కోట్ల రూపాయలు అందించామని, ఇంకా 46 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నదని., మరో 45 రోజుల్లో మిగిలిన రైతుబంధు చెక్కులు ఇవ్వనున్నామని భరోసా ఇచ్చారు. రైతు భీమా కింద జిల్లాలో 769 మంది బీమా చేయించుకున్నారని., 736 మందికి చెక్కు బాండ్లు అందజేసినట్లు వివరించి., జిల్లాలోని 23 మండలాల్లోని గ్రామాల వారీగా మృత్యువాత పడుతున్న రైతుల యొక్క సమగ్ర వివరాలను విశ్లేషణగా సేకరించాలని సూచించారు.
మృతుల్లో రోగులు, యాక్సిడెంట్, డెంగీ, ఇతరత్రా కారణాలతో మృతికి గురైన అంశాలను విశ్లేషణగా సమగ్ర సమాచారాన్ని నివేదిక రూపంలో ఇవ్వాలని, వీరిలో 18 వయస్సు నుంచి 59 వయస్సు కలిగిన వారి వివరాలను సేకరించాల్సి ఉంటుందని., దీంతో ఏఏ కారణాలతో మృతి చెందారో.. ఆయా రైతులకు ఇంకా మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు.జిల్లాలోనీ వ్యవసాయ శాఖ 109 మంది అధికారులతో నెల తర్వాత తిరిగి 3 గంటలు సుదీర్ఘంగా సమీక్షిస్తానని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి సూచించారు. ప్రతి గ్రామంలో సమగ్ర సమాచారాన్ని స్పష్టంగా సేకరించి దానిపై సమీక్షించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
 
 
జిల్లాలో రబీ పంటకు ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. రబీ సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా ప్రత్యేకించి అధికారులు చొరవ చూపి నిర్ణీత మోతాదులోనే రైతులు ఎరువుల వాడకాన్ని జరిపేలా ప్రోత్సహించాలని ఏఓలకు సూచించారు. సంప్రదాయేతర పంటల వైపు రైతులు మొగ్గు చూపేలా రైతులను ప్రోత్సహిస్తూ.. అధిక లాభాలు గడించే పంటల సరళి వైపు రైతులను మళ్లించి సుశిక్షితులను చేయాల్సిన అవసరం వ్యవసాయ శాఖ అధికారులపైనే ఉన్నదని దిశా నిర్దేశం చేశారు. సేంద్రీయ వ్యవసాయం చిరుధాన్యాల సాగు ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటు చేసే దిశగా తమవంతు కృషి చేయాలని ఏఓలను కోరారు.
 
 
రైతుబంధు, రైతు భీమా, పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన వంటి పథకాల గురించి సమీక్షిస్తూనే.. అర్హులైన ప్రతి ఒక్క రైతుకు సకాలంలో రైతు బీమా చేయించాలని, అలాగే రైతు బీమా క్లెయిమ్ కుడా వీలైనంత తొందరగా పూర్తి చేసి రైతు కుటుంబాలకు అందించి ఆర్థిక శక్తిని కలుగజేసే విధంగా తోడ్పాటును అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి వ్యవసాయ శాఖ అధికారి రైతులకు అందుబాటులో ఉంటూ వారి వ్యవసాయ సరళిలో కొత్త మార్పులతో అధిక దిగుబడులు పొందే విధంగా కృషి చేయడమే ప్రధాన కర్తవ్యంగా లక్ష్యాన్ని పెట్టుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.