ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోమ్ మంత్రి,బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఈ రోజు మంగళవారం భేటీ అయ్యారు. దాదాపు నలబై నిమిషాల పాటు పలు అంశాలపై ఇరువురు చర్చించారు.
ఈ చర్చల్లో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. విభజన చట్టంలోని హామీల నేరవేర్చడంపై పలు అంశాల గురించి చర్చించారు. ముఖ్యమంత్రి జగన్ అడిగిన పలు సమస్యల పరిష్కారంపై.. నిధులు కేటాయింపు పై కేంద్ర మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారని సమాచారం.