Home / INTERNATIONAL / ప్రపంచాన్ని గడగడలాడించిన అంతర్జాతీయ ఉగ్రవాది..సైన్యం చేతిలో కుక్కచావు

ప్రపంచాన్ని గడగడలాడించిన అంతర్జాతీయ ఉగ్రవాది..సైన్యం చేతిలో కుక్కచావు

ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ యొక్క నాయకుడైన బు బక్ర్ అల్-బాగ్దాది ప్రపంచ జిహాద్కు అధ్యక్షత వహించి, ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ వ్యక్తిగా అవతరించాడు. సిరియాలో నరమేధం సృష్టిస్తూ.. ప్రపంచాన్ని గడగడలాడించిన అంతర్జాతీయ ఉగ్రవాది, బాగ్దాదీ అగ్రరాజ్యం అమెరికా సైన్యం చేతిలో కుక్కచావు చచ్చాడు. అమెరికా సైనిక కుక్కలు వెంటపడుతుండగా.. బంకర్‌లో ప్రాణభయంతో తన వెంట ముగ్గురు చిన్నారులు వెంటతీసుకుని పరుగులు పెడుతూ చివరకు తనను తాను పేల్చుకుని ప్రాణాలు విడిచాడు. సిరియాలో నరమేధం సృష్టిస్తూ.. అమెరికాపై ప్రతీకారంతో అమాయకురాలైన అమెరికా సామాజిక కార్యకర్తపై అతి క్రూరంగా అత్యాచారానికి పాల్పడి.. ఆమెను అతి దారుణంగా హత్యచేసిన ఈ ఉన్మాది ఉగ్రవాది చివరకు ఆమె పేరుతో నిర్వహించిన ఆపరేషన్‌లోనే అంతమొందాడు.

అమెరికాకు చెందిన కైలా మ్యూలర్ అనే సామాజిక కార్యకర్త తన విధులను ముగించుకుని వస్తుండగా బాగ్దాదీ కిడ్నాప్ చేసి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసి క్రూరంగా చంపాడు. ఆమె పేరుతో అంటే ‘ ఆపరేషన్ కైలా మ్యూలర్’ అని పేరుపెట్టి అగ్రరాజ్యం అమెరికా ఈ ఉగ్రవాదిని అంతమొందించింది. సిరియాలోని ఇడ్లిబ్ ఫ్రావిన్స్‌లో అనే గ్రామంలో తలదాచుకుంటున్న 48 సంవత్సరాల బాగ్దాదీ తరుచూ తన స్థావరాలను మార్చుకుంటూ అమెరికా పక్కలో బల్లెంలా మారాడు. సిరియాను తన గుప్పిట్లో పెట్టుకుని ఇతను చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. చివరకు అగ్రరాజ్యం గత కొనే్నళ్లుగా సీక్రెట్‌గా ఈ ఉగ్రవాది కార్యకలాపాలను పసిగట్టి బగ్దాదీ ముఖ్య అనుచరుడు ఇచ్చిన పక్కా సమాచారంతో అంతమొందించింది. ఈ ఆపరేషన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి అనుమతి రావటం తరువాయి. ఆదివారం తెల్లవారు జామున 8 హెలికాఫ్టర్లలో అమెరికా సైనిక దళాలు బగ్దాదీ ఉంటున్న బంకర్‌ను చుట్టుముట్టాయి. ఇక తనకు చావు తప్పదను ఈ కరుడుగట్టిన ఉగ్రవాది ప్రాణభయంతో పరుగు లంకించుకున్నాడు. ఈ ఆపరేషన్‌ను అమెరికా అధ్యక్షుడు వీడియో ప్రసారం తిలకించటం జరిగింది. తొలుత ఎనిమిది హెలికాఫ్టర్లు ఉత్తర ఇరాక్‌ నుంచి బయల్దేరాయి. సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రావిన్స్‌లో మిడిల్‌ ఈస్ట్‌లో ప్రవేశించాయి. బాగ్దాదీ ఉన్న ప్రాంతానికి చేరుకోగానే అమెరికా సైన్యానికి చెందిన రోటార్‌ సీహెచ్‌-47 విమానాలు రెండు అల్‌- అసద్‌ ఎయిర్‌బేస్‌ కేంద్రంగా బుల్లెట్ల వర్షం కురిపించాయి. ఈ క్రమంలో తన చావు ఖాయమని భావించిన బాగ్దాదీ తమ అండర్‌ గ్రౌండ్‌ బంకర్లలోకి వెళ్లి తల దాచుకున్నాడు. అంతేకాదు అమెరికా సైనికులు తనను సమీపిస్తున్న క్రమంలో ఆత్మాహుతి దాడి జాకెట్‌ ధరించి ముగ్గురు అమాయక పిల్లల్ని తన వెంట తీసుకువెళ్లాడు. అయితే అమెరికా సైన్యానికి చెందిన జాగిలాలు బాగ్దాదీని వెంబడించడంతో బంకర్‌ టన్నెల్‌ చివరికి చేరగానే తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో బాగ్దాదీతో పాటు ముగ్గురు చిన్నారులు కూడా చనిపోయారు. తునాతునకలైన బాగ్దాదీ శరీరభాగాలను సేకరించి 15 నిమిషాల్లోనే ఫోరెన్సిక్ నిపుణులు డిఎన్‌ఏ పరీక్ష నిర్వహించి చనిపోయింది బాగ్దాదీ అని నిర్థారణకు వచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat