Home / ANDHRAPRADESH / టీటీడీ మరో బంపర్ ఆఫర్..వారికి ప్రతి రోజూ 4 వేల టోకెన్లు..!

టీటీడీ మరో బంపర్ ఆఫర్..వారికి ప్రతి రోజూ 4 వేల టోకెన్లు..!

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి భక్తులకు మరో బంపర్‌ ఆఫర్ ప్రకటించారు. వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే వృద్ధులకు అరగంటలోనే శ్రీవారి దర్శనం భాగ్యం కల్పించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. తాజాగా వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా 4వేల టోకెన్లను కేటాయించినట్లు టీటీడి తెలిపింది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడి శ్రీవారి భక్తులను కోరింది. కాగా ప్రస్తుతం ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ 1400 టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడి తెలిపింది. ఉదయం 7 గంటల నుండి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు ఇస్తున్నారు. ఇక నుంచి మూడుస్లాట్లలో 4 వేల టోకెన్లను వృద్ధులు, దివ్యాంగులకు జారీ చేయనున్నారు. ఇక రేపు అనగా అక్టోబర్ 30, బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 5 సంవత్సరాల లోపు చిన్నారులకు, వారి తల్లిదండ్రులను సుపథం మార్గం ద్వారా స్వామి వారి దర్శనానికి అనుమతించనున్నారు. మామూలుగా సాధారణరోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు మాత్రమే సుపథం మార్గం ద్వారా దర్శనభాగ్యం కల్పిస్తారు. అయితే 5 ఏళ్లలోపు చిన్నారులు క్యూలైన్లలో పడుతున్న ఇబ్బందులను చూసి టీటీడీ గమనించింది. ఈ మేరకు బుధవారం 5 ఏళ్ల చిన్నారులకు, వారి తల్లిదండ్రులను సుపథం మార్గం ద్వారా స్వామి వారి దర్శనానికి అనుమతించనున్నారు. మొత్తంగా టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైవీ సుబ్బారెడ్డితిరుమల తిరుపతి దేవస్థానంలో పలు విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువస్తున్నారు. తాజాగా టీటీడీ తీసుకున్న నిర్ణయంతో వృద్ధులు, దివ్యాంగులకు శ్రీ వారి దర్శనం సులభతరం కానుంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat