రష్మిక మంధాన ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు కుర్రకారు గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తూ.. మత్తెక్కిస్తున్న అందాల రాక్షసి. వరుస విజయాలతో అమ్మడు ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా స్టార్ హీరోతో రోమాన్స్ చేయడానికి సిద్ధమవుతుంది రష్మిక. టాప్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైల్ స్టార్ యువహీరో అల్లు అర్జున హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో రష్మిక మంధాన హీరోయిన్ గా ఎంపికైంది.
ఈ చిత్రం యొక్క పూజా కార్యక్రమాలు మైత్రీ మూవీస్ ఆఫీసులో జరిగింది. ముహుర్తపు షాట్ కు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చాడు. దర్శకుడు కొరటాల శివ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. సురేందర్ రెడ్డి స్క్రిప్టు ను యూనిట్ కు అందించాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.