Home / ANDHRAPRADESH / చినముషిడివాడలో అంగరంగవైభవంగా విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి జన్మదిన మహోత్సవం..!

చినముషిడివాడలో అంగరంగవైభవంగా విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి జన్మదిన మహోత్సవం..!

ఈ రోజు షణ్మత స్థాపనాచార్య జగద్గురు శంకరాచార్య సంప్రదాయ మూర్తి, అద్వైత స్వరూపులు, విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినోత్సవ వేడుకలు విశాఖపట్టణం, చినముషిడివాడలోని,  విశాఖ శ్రీ శారదాపీఠంలో అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి జన్మదినోత్సవ వేడుకలకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు వేలాదిగా భక్తులు హాజరయ్యారు.  ఏపీ ప్రభుత్వం నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్య అతిధిగా హాజరై, సీఎం జగన్ తరపున, రాష్ట్ర ప్రజలందరి తరపున మహాస్వామివారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..హిందూ ధర్మాన్ని భావితరాలకు అందించేందుకు మహాపురుషులు పుడుతూనే ఉంటారు. అటువంటి మహాపురుషుల కోవకు చెందినవారు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు అని కొనియాడారు. విజయసాయిరెడ్డి మాట్లాడిన అనంతరం శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారు భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. స్వామివారు మాట్లాడుతూ..నాగుల చవితినాడు ఆ  భగవంతుడు నాకు జన్మనివ్వడం నిజంగా..అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం..ఒక జగద్గురు ఆదిశంకరాచార్య సంప్రదాయ ఆధ్యాత్మిక పీఠంగా కాకుండా.. ఆదిశంకరాచార్యుల వారి అద్వైత సిద్ధిని ప్రచారం చేసే పీఠంగా కాకుండా.. విప్లవాత్మకమైన పోరాటాన్ని సృష్టించిందని మహాస్వామి తెలియజేశారు. విశాఖ శ్రీ శారదాపీఠమంటే..కేవలం తర్కం, వ్యాకరణం, మీమాంస, వేదాంతం మాత్రమే చదువుకున్న పండితుల పీఠం కాదు. ఇది ఒక తపో పీఠమని, ఈ భారతదేశంలో తపస్సు చేసి, నిరంతరం ఆ తపస్సుతో ధర్మపోరాటానికి నిలిచిన ఏకైక పీఠం..విశాఖ శ్రీ శారదాపీఠమని స్వరూపానంద చెప్పారు. ఈ శారదాపీఠానికి రాజశ్యామల స్వరూప శారదాంబ.. ఇలవేల్పు దైవం అయితే.. ఉపాసన దైవం..శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి. నిరంతరం ఏ రంగంలోనైనా పోరాటానికి సిద్ధంగా ఉండేలా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాసన నన్ను తయారు చేసిందని మహాస్వామి అన్నారు. ఈ విశాఖ శ్రీ శారదా పీఠం ఒక రజోగుణంతో కూడుకున్న పీఠం..దేన్నైనా ప్రశ్నించే..దేనికైనా జవాబు చెప్పే ఒక వినూత్నమైన, విప్లవాత్మకమైన పీఠమని మహాస్వామి స్పష్టం చేశారు.  ప్రతి సంవత్సరం జరిగినట్లుగా ఈ  సంవత్సరం కూడా ఇంత గొప్పగా..భగవంతుడు ఇచ్చిన ఈ శరీరానికి.. పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయంటే..నాలోపల ఉన్న ఆత్మానందుడు ఆనందపడుతున్నాడు.

ఇది నాకు ఆనందం కాదు..శరీరం నిత్యం కాదని..నా ఆత్మ, పరమాత్మ యొక్క స్వరూపమన్న..జ్ఞానం ఉందని, ఆ జ్ఞానంతో ఆలోచిస్తే..అవయవాలతో కూడుకున్న ఈ శరీరాన్ని ధర్మం కోసం త్యాగం చేయాలని భగవంతుడు ఆదేశించాడు కాబట్టే.. ఎన్నో, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ..భక్తుల కోసం.. శారదాపీఠం యొక్క అభిమానుల కోసం..ఈ జన్మదిన వేడుకలు..నాగులచవితినాడు దేదీప్యమానంగా జరుగుతున్నాయని స్వామిజీ ముక్తాయించారు.

 విశాఖ శ్రీ శారదాపీఠం భక్తుల గురించి మాట్లాడుతూ.. ఈ రోజంతా ప్రతి ఇంట్లో ప్రతి పిల్లా, పెద్దా అందరూ కూడా పుట్టలో పాలుపోస్తారని, అది కూడా వదిలిపెట్టి..స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఉపాసకుడు అని చెప్పి.. నా పురాతన భక్తులు..అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నవారందరూ కూడా నాతోనే గడుపుతున్నారంటే..నిజంగా నాకు ఆనందమేస్తుంది.మీరు చూపిన అభిమానానికి మిమ్మల్ని ఆ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి అనుగ్రహించాలని స్వామిజీ దీవించారు.  ఈ వేడుకల్లో ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే..శ్రీ వేంకటేశ్వరస్వామి వారి పాద రేణువులు ఈ జన్మదినోత్సవానికి పంపించారా అన్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో ధర్మారెడ్డి,  శేషాద్రి, అక్కడ ఉన్న పండితవర్గమంతా వచ్చి..శ్రీ వేంకటేశ్వరస్వామిచేత ఆశీర్వవచనాలు పంపించారని ఆనందం వ్యక్తం చేశారు.

తెలుగు రాష్ట్రాల సీఎంల గురించి స్వామిజీ మాట్లాడుతూ.. ఈ రోజు నాకు అత్యంత ప్రియమైన శిష్యుడు..జగన్మోహన్ రెడ్డి, ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా ముందుండమని  విజయసాయిరెడ్డిని పంపించారు. కేసీఆర్ గారు కూడా రావల్సింది.. వారు కూడా 20 నిమిషాలు..ఫోన్‌లో మాచేత ఆశీర్వవచనాలు పొందారని మహాస్వామివారు తెలియజేశారు. విశాఖ శ్రీ శారదాపీఠమంటే..ఒక రాజకీయ వేదిక కాదు..ఇది భక్తుల వేదిక..ధర్మపోరాట వేదిక..ధర్మం కోసం ఎవరు నిల్చున్నా..వారికి వెన్నుదట్టి..వెనుక వుండి..ప్రోత్సాహం ఇచ్చే విప్లవాత్మకమైన పీఠమని స్వామివారు భావోద్వేగంతో చెప్పారు.

ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి గురించి మాట్లాడుతూ.. నా తర్వాత ఈ స్వరూపానందేంద్ర కళ్లలో కనిపించే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి  అంశ..మా స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు.  యావత్ భారతదేశమంతటా తిరగాలి..గ్రామాలు. పల్లెలు, పట్టణాలలో ధర్మ ప్రచారం చేయాలి..హిందూ ధర్మం కోసం పోరాటం చేయాలని స్వాత్మానందేంద్రకు బాధ్యతలు అప్పజెప్పి..విజయవాడలో అత్యద్భుతంగా పట్టాభిషేకం చేశాం.వారు ఈ రోజు పర్యటన ఆపుకుని..ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారని మహాస్వామి చెప్పారు.

జన్మదినోత్సవ వేడుకల గురించి శ్రీ స్వరూపానందేంద్ర  మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం  ఈ జన్మదినోత్సవ వేడుకలను భక్తులు చాలా బ్రహ్మాండంగా చేస్తారు. కానీ ఈ సంవత్సరం..విజయసాయిరెడ్డి ఆదేశాల మేరకు,  ధర్మానికి రుణం తీర్చుకోవడానికి.. అతి చిన్న కుర్రవాడైన అదీప్‌రాజు చాలా బ్రహ్మాండంగా సేవలందించారు. ఆయన, ఆయన పరివారం వారికి, ధర్మాన కృష్ణదాసు గారికి, అన్ని పార్టీల నాయకులకు, వేడులకు విచ్చేసిన భక్తులందరికీ ఆ  భగవంతుడి కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని మహాస్వామివారు దీవించారు. చివరగా మాట్లాడుతూ.. భారతదేశం అటు గంగా..ఇటు కృష్ణా, గోదావరి, కావేరి..అన్ని నదీమతల్లుల సాక్షిగా… హిందూ ధర్మం చాలా గొప్పగా..వెలుగొందాలని మనసారా..శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి  పాదాల సాక్షిగా వేడుకుంటూ..మీ అందరిని ఆశీర్వదిస్తున్నానని శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారు

తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యానారాయణ, పెందుర్తి వైసీపీ కోఆర్డినేట్ అదీప్‌రాజ్, తనికెళ్ల భరణి, రాజారవీంద్ర వంటి సినీ ప్రముఖులు, టీటీడీ తెలంగాణ సలహామండలి అడ్వైజరీ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. స్వామివారి అనుగ్రహభాషణం తర్వాత తిరుపతి, శ్రీ శైలం, అన్నవరం, కదిరి లక్ష్మీ నరసింహ ఆలయాలను నుంచి వచ్చిన అర్చకులు  పట్టువస్త్రాలు, పూలు, పండ్లతో స్వామివారిని సత్కరించి, ఆశీస్సులు తీసుకున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat