Home / TELANGANA / మంచినీటి సరఫరాలో జలమండలి పనితీరు అద్భుతం..!!

మంచినీటి సరఫరాలో జలమండలి పనితీరు అద్భుతం..!!

హైదరాబాద్ నగరవాసులకు మంచినీటి సరఫరాలో జలమండలి పనితీరు అద్భుతమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. శనివారం ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జలమండలి ఎండీ దానకిషోర్ తో కలిసి సనత్ నగర్ పైలెట్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. మరింత మెరుగైన మంచినీటి సరఫరా, మంచినీటి పొదుపు, వృథా నీటిని తగ్గించడం, లెక్కలోకి రాకుండా పోతున్న నీటిని తగ్గించడం కోసం మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారి సూచనలతో పైలెట్ ప్రాజెక్టును జలమండలి సనత్ నగర్ నియోజకవర్గంలో మొదలు పెడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు విజయవంతం అయ్యేందుకు స్థానిక ప్రజలు, కాలనీ సంఘాలు తోడ్పాటునందిస్తాయని వివరించారు. ఈ ప్రాజెక్టు విజయవంతమయితే ఏడాదిలో నగరవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేపడతామని తలసాని తెలిపారు. గడిచిన ఐదు సంవత్సరాలుగా ప్రజలకు మంచినీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా జలమండలి విశేషంగా కృషి చేస్తుందని అభినందించారు. జలమండలి ఎండీగా దానకిషోర్ బాధ్యతలు తీసుకున్న తరువాత జలమండలి మరింత మెరుగైన సేవలు అందిస్తుందని తెలిపారు. టెక్నాలజీ వినియోగించి ఇంకా సులువైన పద్దతుల్లో ప్రజలకు చెరువ కావాలని సూచించారు. కోటి మందికి పైగా ఉన్న నగర జనాభాకు అందుకు తగ్గట్టుగానే సేవలు జలమండలి అందిస్తుందని తెలిపారు.
అలాగే సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలకు మరింత మెరుగైన మంచినీటి సరఫరా చేపట్టేందుకు సనత్ నగర్ అల్విన్ వద్ద రిజర్వాయర్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఆ రిజర్వాయర్ పూర్తి కావడంతో ఈ నెల 7వ తేదిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు గారి చేతుల మీదుగా రిజర్వాయర్ ప్రారంభోత్సవం చేపడుతామని వివరించారు. ఈ రిజర్వాయర్ అందుబాటులోకి వస్తే స్థానిక ప్రజలకు మంచినీటి సరఫరా మెరుగవుతుందని వివరించారు. అలాగే ఈ కార్యక్రమంలోనే పైలెట్ ప్రాజెక్టులో చేపట్టబోయే అంశాలను ప్రజలకు వివరిస్తామని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ నగరంలో జలమండలి సరఫరా చేస్తున్న నీటిలో ప్రజల ఇంటి వద్ద అధికంగా నీటి వృథా జరుగుతుందని వివరించారు. ఈ నీటి వృథాను తగ్గించేందుకు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం సనత్ నగర్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం స్థానిక కాలనీ సంఘాలు, సీనియర్ సిటిజన్ సంఘాలు, ఎన్జీవోల సాయంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తామని వివరించారు. ఇప్పటీకే మిని జెట్టింగ్ యంత్రాలతో ఇరుకైన వీధుల్లో సెవరెజీ పనులు చేపడుతూ జలమండలి విజయవంతమైందని తెలిపారు. అలాగే మరింత ఇరుకైన వీధుల్లో సైతం సెవరెజీ పనులు చేపట్టడానికి మైక్రో జెట్టింగ్ యంత్రాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. త్వరలోనే ఈ యంత్రాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
అలాగే పైలెట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టే కార్యక్రమాలను ఎండీ దానకిషోర్ మంత్రి గారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat