Home / ANDHRAPRADESH / బుల్‌బుల్ బాలయ్యకు..బుల్‌బుల్ తుఫాన్‌కు లింకేంటి..నెట్‌లో వైరల్ వీడియో..!

బుల్‌బుల్ బాలయ్యకు..బుల్‌బుల్ తుఫాన్‌కు లింకేంటి..నెట్‌లో వైరల్ వీడియో..!

బంగాళాఖాతంలో తుఫాన్‌కు బుల్‌బుల్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ బుల్ బుల్ తుఫాన్ ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరంలో అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉంది. అయితే బుల్‌‌బుల్‌ తుఫాన్‌‌కు ఆ పేరు పెట్టడం వెనుక బుల్‌బుల్ బాలయ్యే అని సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో జోకులు పేలుతున్నాయి. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వియ్యంకుడు, సినీ హీరో నందమూరి బాలయ్య సారే జహాసే అచ్చా గీతాన్ని పాడబోయి..తత్తరపాటుతో బుల్‌బుల్ అంటూ కామెడీ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బుల్‌బుల్ బాలయ్య అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫానుకు బుల్‌బుల్ అని పేరుపెట్టడంతో సోషల్ మీడియాలో మరోసారి బాలయ్య బుల్‌బుల్ కామెడీ మార్మోగిపోతుంది. తుఫాను‌ను ఒంటిచేత్తో వెనక్కి పంపానని చెప్పే చంద్రబాబుకు, బాలయ్య బుల్‌బుల్‌ కామెడీని లింక్ చేస్తూ నెట్‌జన్లు ఓ రేంజ్‌లో జోక్‌లు వేస్తున్నారు. నేను హైదరాబాద్ డెవలప్ చేసినట్టు, హుథూథ్‌ను ఒంటి చేత్తో ఆపినట్టు..మా సడ్డకుడయిన బావ “యే బుల్ బుల్” “యే బుల్ బుల్” అని అల్లకల్లోలంగా పాడిననందుకే , ఈ రోజు వెస్ట్ బెంగాల్ ని అల్లకల్లోలం చేస్తున్న తుఫానుకి ‘బుల్ బుల్’ అని పేరుపెట్టారని తెలియచేస్తున్నందుకు.. చాలా సంతోషంగా ఉంది తమ్ముళ్లూ.. అంటూ చంద్రబాబు చెబుతున్నట్లు నెట్‌జన్లు జోకుల మీద జోకులు వేస్తున్నారు. మొత్తంగా బుల్‌బుల్ తుఫాన్ సందర్భంగా బాలయ్య బుల్‌బుల్ కామెడీ వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నేను హైదరాబాద్ డెవలప్ చేసినట్టు, మా సడ్డకుడయిన బావ "యే బుల్ బుల్" "యే బుల్ బుల్" అని అల్లకల్లోలంగా పాడిననందుకే , ఈ రోజు వెస్ట్ బెంగాల్ ని అల్లకల్లోలం చేస్తున్న తుఫానుకి 'బుల్ బుల్' అని పేరుపెట్టిన్రని తెలియచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది తమ్ముళ్లూ.

Posted by Vijaya Kesari on Sunday, 10 November 2019

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat