రష్మిక మంధాన వరుస విజయాలతో.. ఆకట్టుకునే అందం.. అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన అందాల రాక్షసి. తాను నటించిన చిత్రాలన్నీ ఘన విజయాలను సాధించడంతో ఈ ముద్దుగుమ్మ తన రెమ్యూనేషన్ ను భారీగా పెంచేసింది ఈ ముద్దుగుమ్మ.
అందులో భాగంగా అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న తాజా చిత్రంలో రష్మిక మంధానను లీడ్ రోల్ గా అవకాశమివ్వాలని నిర్ణయించారంటా. అయితే అమ్మడు భారీగా రెమ్యూనేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
దీంతో కోపమోచ్చిన దిల్ రాజు మంధానను ఈ చిత్రంలో అవకాశమివ్వద్దని డిసైడయ్యారని వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే భారీ రెమ్యూనేషన్ కారణంగా అమ్మడు చాలా అవకాశాలను కోల్పోతున్నట్లు వార్తలు ఫిల్మ్ నగర్లో గుసగుస..