Home / ANDHRAPRADESH / జిల్లాకు వచ్చి మరీ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన సీఎం

జిల్లాకు వచ్చి మరీ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన సీఎం

ప్రకాశంజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా క్లాసులు టీసుకున్నట్టుగా తెలుస్తోంది..ఎమ్మెల్యేల పనితీరుపై నియోజకవర్గాల్లో ఏం జరుగుతోందనే అంశం గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు సీఎం. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేల్లో ఒక్కోరికి ఒక్కో అంశంలో తలంటారట సీఎం. సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు పేరుతో ఆయన నియోజకవర్గంలో కొందరు సాగిస్తున్న దందాల గురించి సీఎం గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గం పరిధిలోని గ్రానైట్ క్వారీల వారిని ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారనే అభియోగాలున్నాయి.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా టాక్. అలాగే మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డికి గట్టిగానే క్లాస్ పడిందని సమాచారం..

 

 

ప్రతి విషయంలోనూ నాగార్జున రెడ్డి తమ్ముడు వారి తండ్రి నాగార్జున రెడ్డి ఇన్వాల్వ్ అవుతున్నారని వారు కూడా ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారనే అంశాన్ని సీఎం ప్రస్తావించినట్టుగా సమాచారం.గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కూడా సీఎం నుంచి గట్టి వార్నింగే వచ్చినట్టుగా సమాచారం. ఆయన గిద్దలూరులో ఉండకుండా ఎంతసేపూ మార్కాపురానికి పరిమితం అవుతున్న విషయాన్ని ప్రస్తావించారట సీఎం. తనను కలవాలనుకునే వాళ్లను మార్కాపురానికే రమ్మంటారట ఈయన . అలాగే నిజమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అవకాశం ఇవ్వకుండా టీడీపీ బ్యాచ్ నే అన్నా రాంబాబు ఎంకరేజ్ చేస్తున్న అంశాన్నీ సీఎం ప్రస్తావించినట్టుగా సమాచారం.

 

 

 

ప్రతి అంశంలోనూ అన్నా రాంబాబు పాత టీడీపీ వాళ్లకే ప్రాధాన్యతను ఇస్తున్న దాఖలాలున్నాయి. అలాగే నియోజకవర్గంలో బలంగా ఉన్న రెడ్డి సామాజికవర్గాన్ని అన్నా రాంబాబు పూర్తిగా పక్కన పెట్టారు.కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ స్థానికంగా అందుబాటులో ఉండరనే పేరుంది. ఆయన బెంగళూరు నుంచి పాలన సాగిస్తూ ఉన్నారట. ఈ అంశాన్ని ప్రస్తావించారట ముఖ్యమంత్రి.దర్శి ఎమ్మెల్యే కు కూడా ఇదే అంశంలో క్లాస్ తప్పలేదని సమాచారం. ఎమ్మెల్యే బెంగళూరులో ఉంటే ఆయన తమ్ముడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న అంశాన్ని జగన్ ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది.ఇక చీరాల ఇన్ చార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ను దూకుడు తగ్గించుకోవాలని సీఎం సూచించారట. ఆయన తీరుపై కూడా ముఖ్యమంత్రి కొంత అసహనంతో ఉన్నట్టు చెప్తున్నారు. మొత్తంగా ప్రకాశం జిల్లా టూర్ వేసిన ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలందరికీ ఉన్న చిన్న చిన్న తప్పులు సరిదిద్దు కోవాలి అని ఒకవేళ ఏమైనా తప్పులు చేస్తుంటే మానుకోవాలని క్లాసులు పీకారట.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat