రాశీ ఖన్నా..టాలీవుడ్ లో ఒకప్పుడు ఊపూపిన హీరోయిన్ తాను టాలీవుడ్ లో అడుగుపెట్టిన తన మొదటి చిత్రంతోనే చాలా ఫేమస్ అయ్యింది. అనంతరం ఎన్నో అవకాశాలు తనను వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అలా కొన్ని నాళ్ళు ఇండస్ట్రీ లో ఆమె హవా బాగానే నడిచింది. టైమ్ ముందుకు వెళ్ళే కొద్ది అవకాశాలు కూడా తగ్గుతున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ భామ వెంకీ మామ చిత్రంలో నాగ చైతన్య సరసన నటిస్తుంది. తాజాగా ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నెటీజన్లు లేట్ అయ్యేకొద్ది లేటెస్ట్ గా కనిపిస్తున్నవని కామెంట్స్ కూడా చేస్తున్నారు.