ఏపీ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మండలంలోని అచ్చంపేట జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.
మలికీపురం నుంచి వస్తోన్న బస్సు విశాఖపట్టణం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో దాదాపు ముప్పై ఆరు మంది ప్రయాణికులున్నారు. హఠాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో నలుగురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.