Home / Government / కళ్లు లేకుంటేనేం.. కల నెరవేర్చుకుంది.. తొలి అంధ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ గా చరిత్రకెక్కింది..!

కళ్లు లేకుంటేనేం.. కల నెరవేర్చుకుంది.. తొలి అంధ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ గా చరిత్రకెక్కింది..!

అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో.. పోరాడిన ప్రతి వ్యక్తి గెలుస్తారనేది అంతే సత్యం. తన బతుకులో చీకట్లు ఉన్నాయి కానీ తన గమ్యాన్ని సాధించడంలో కాదని  నిరూపించిన  ఓ యువతి భారతదేశపు మొట్టమొదటి అంధ ఐఎఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. కళ్లు, కాళ్లు చక్కగా ఉండి ఏమీ చేయలేకపోతున్నాం అని అనుకునేవారికి ఆమె ఆదర్శం. కళ్లు లేకపోయినా ఐఏఎస్ కావాలనే తన కలను సాకారం చేసుకునేందుకు అహర్నిశలూ కష్టపడింది చివరికి గమ్యాన్ని చేరి తనలాంటి ఎందరో దివ్యాంగుల గుండెల్లో ఆత్మవిశ్వాన్ని నింపింది. ఆమె పేరు ప్రంజల్‌ పాటిల్‌ వయస్సు 30ఏళ్లు.

 

 

మహారాష్ట్రలోని ఉల్లాస్‌నగర్‌కు చెందిన ప్రంజల్ కు పుట్టుకతోనే  పాక్షిక అంధత్వం ఉంది. ఆమె కంటిచూపు పూర్తిగా పోయే అవకాశం ఉన్నదని  డాక్టర్లు ఆమె తల్లిదండ్రులకు ముందు గానే  చెప్పారు. కానీ విధి వైపరీత్యం ఆమె రెండో తరగతి చదువుతున్నపుడు ఓ సహ విద్యార్థి పెన్సిల్‌తో ఆమె కంట్లో పొడవడంతో ఆమె పూర్తిగా కంటిచూపు కోల్పోయారు. అయినా సరే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువుకొనసాగించింది.

 

ప్రాంజల్ సాధారణ పాఠశాలలో నే చదువు కొనసాగించారు. తర్వాత పరిస్థితిలు చాలా కష్టంగా మారాయి. ఆమెను బద్లాపూర్‌లోని ఒక స్కూల్‌లో చేర్చగా  అక్కడి వాతావరణంలో ఆమె ఇమడలేకపోయారు. దీంతో ఆమెను ముంబైలోని దాదర్‌లో గల కమలాబాయి మెహతా స్కూల్‌లో చేర్చారు. అక్కడ సోమవారం నుంచి శుక్రవారం వరకు అదే స్కూల్లో హాస్టల్ లో ఉంటూ చదువు కొనసాగించారాని కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే ఆమె ఇంటికి వచ్చేది అని ఆమె తండ్రి ఎల్బీ పాటిల్ చెప్పారు. హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ (హెచ్ఎస్‌సీ) పరీక్షల్లో జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఘనత ప్రాంజల్ ది. హెచ్ఎస్‌సీ తర్వాత ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో ఆమె చేరారు. అంధుల కోసం అవసరమైన సదుపాయాలన్నీ ఆ కాలేజీలో ఉన్నాయి. ప్రాంజల్ విశ్వవిద్యాలయం స్థాయిలో ఫస్ట్ ర్యాంక్‌తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం ద్వారా ఆమె ఆత్మవిశ్వాసం తెలుస్తుంది. ప్రతిష్టాత్మక జేఎన్‌యూలో అంతర్జాతీయ వ్యవహారాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

 

అనంతరం 2016లో తొలిసారి యూపీఎస్సీ రాసి 773వ ర్యాంకు సాధించింది. ఆ ర్యాంకుతో తనకు ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ (ఐఆర్ఏఎస్) ఉద్యోగం వచ్చింది. అయితే ఆమె అంధురాలు కావడంతో ఆమెకు ఇచ్చిన పోస్టును రద్దు చేశారు. ఈ విషయం కొంతమేరకు ఆమెను భాదించినా రెట్టింపు ఆత్మవిశ్వాసం తో మళ్లీ యూపీఎస్సీ పరీక్షలు రాయగా ఆమెకు 124వ ర్యాంక్‌ వచ్చింది. దీంతో ఆమె ఐఏఎస్‌గా ఎంపికై తన గమ్యానికి చేరువయ్యారు ఏడాది కాలం శిక్షణలో భాగంగా కేరళలోని ఎర్నాకులం అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పనిచేశారు. రైల్వే ఉద్యోగం తిరస్కరణకు గురికావడంపై తానెంతో వేదనకు గురయ్యానని ఆమె వెల్లడించారు. కళ్లకు చేసిన శస్త్రచికిత్స కూడా విఫలం అయినట్లు ఆమె తెలిపారు.తిరువనంతపురంలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తున్న కార్యక్రమంలో సామాజిక న్యాయ విభాగం సెక్రటరీ బిజు ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఇప్పుడు ఏకంగా ఓ జిల్లాకి సబ్ కలెక్టర్ అయ్యి రికార్డు సృష్టించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat