టాలీవుడ్ యంగ్ హీరో హైదరాబాద్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. యంగ్ హీరో ప్రిన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు దొరికిపోయాడు. ఈ మేరకు ఈరోజు కోర్ట్ మెట్లు ఎక్కాడు ప్రిన్స్. ఈ నెల 24న బాచుపల్లి సమీపంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా అక్కడ పోలీసులకు దొరికాడు. దాంతో వారు కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు ఈరోజు కోర్ట్ లో హాజరయిన ప్రిన్స్ కు జరిమానా విదించడమే కాకుండా గట్టిగా మందలించారు జడ్జ్. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆక్సిడెంట్ లు జరుగుతున్న నేపధ్యంలో ఎంతటివారినైనా సరే వదలేది లేదని. మీరే ఇలా చేస్తే ఎలా అని అన్నారు.