సినీ ఇండస్ట్రీ లొనే కాదు బయట కూడా బాలయ్య బిహేవియర్‌తో ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటాడు. ఈ నందమూరి నటసింహం మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ఇటీవల ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో పాల్గొన్న బాలయ్య , అదిరిపోయే స్టెప్పులతో అలరించాడు. ఆ డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వీడియోలో బాలయ్య రూలర్ లుక్‌లోనే కనిపిస్తుండటంతో ఇది రీసెంట్ వీడియోనే అని అర్థమవుతుంది. ఏ ఈవెంట్ అన్న విషయం తెలియక పోయినా బాలయ్య లుక్, డ్యాన్స్ మాత్రం అదుర్స్ అంటున్నారు. బాలయ్య డాన్స్ తోనే కాక పైసా వసూల్ సినిమాలోని మామా ఎక్ పెగ్ లా పాటను పాడి అక్కడికి వచ్చిన వారిలో మరింత జోష్ నింపాడు. బాలయ్య పాట పాడుతుంటే తమిళ నటుడు ప్రభు పక్కనే ఉండి ఎంకరేజ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
రూలర్ షూటింగ్లో బిజీగా ఉన్న బాలయ్య మంచి జోష్ తో ఉన్నట్లు అర్ధం అవుతోంది.ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు డిజాస్టర్ కావటంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న బాలయ్య, తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన జైసింహాకు మంచి టాక్ రావటంతో ఈ మూవీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన రూలర్ టీజర్ నందమూరి అభిమానులను అలరిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి కి ముందుగానే ప్రేక్షకుల ముందుకు బాలయ్య రానున్నాడు.