జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సినిమా, రాజకీయం ఒకటి కాదని ఇప్పటికీ అర్ధం కాలేదనే చెప్పాలి. ఎందుకంటే సినిమాలో ఉన్న ఫాలోయింగ్ తో రాజకీయాలోకి అడుగుపెట్టి పవన్ ఉన్న కాస్త పరువు పోగొట్టుకున్నాడు తప్ప సాధించింది అయితే ఏమి లేదనే చెప్పాలి. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “సినీ నటుడు వస్తున్నాడంటే నలుగురు పోగవుతారు. తమాషా చూద్దామని జనం వస్తే అర్థం పర్థం లేని డైలాగులు దంచుతాడు. పార్టీ నిర్మాణం లేదు, రెండు చోట్లా చిత్తుచిత్తుగా ఓడిపోయాడు. ఒక ఎమ్మెల్యే ఉన్నా లేనట్టే. ప్యాకేజి కోసం వీధి ప్రదర్శనలిస్తున్నాడు. సానుభూతి చూపడం మినహా ఏం చేస్తాం” అని అన్నారు..