Home / ANDHRAPRADESH / పంచ్ డైలాగులుల్లోనే కాదు పీకే.. జగన్ చేస్తున్న అభివృద్ధిపై కూడా అప్డేట్ లో ఉండు..!

పంచ్ డైలాగులుల్లోనే కాదు పీకే.. జగన్ చేస్తున్న అభివృద్ధిపై కూడా అప్డేట్ లో ఉండు..!

కర్నూలులో 2017లో ఓ స్కూలు యాజమాన్యానికి ఓ పాపకు జరిగిన సంఘటన ఏదో జగన్‌కు సంబంధించింది అయినట్లు మాట్లాడుతున్న పవన్‌ ముందు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి డిసెంబర్‌ 26న జగన్‌ శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిసినా పవన్‌ విమర్శిస్తున్నారని, ముందుగా ఆయన పత్రికలు చదవాలన్నారు. పంచ్ డైలాగులు చెప్పడంలో శ్రద్ధ రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్దిని తెలుసుకోవాలంలో చూపాలని ధ్వజమెత్తారు.

 

 

పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రంలో కులమతాలను, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టే  వైఖరి తో  మాట్లాడుతూ తనకున్న కాస్త విలువను తానే తీసుకుంటున్నాడని సాగునీటి శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం సాయంత్రం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పవన్‌ను ప్రతిపక్ష నేత అందామంటే ఎన్నికల్లో ఒక్క సీటు వచ్చిందని, పోనీ యాక్టర్‌ అందామంటే సినిమాలు కూడా ఆపేశారని తనదైన శైలిలో చురకలు వేశారు.  గతంలో ‘వేర్‌ యూ గో… ఐ విల్‌ ఫాలో…’ అని హచ్‌ మొబైల్‌ నెట్‌వర్క్‌కు సంబంధించి ఒక అడ్వర్టయిజ్‌మెంట్‌ వచ్చేదని ఇప్పుడు పవన్‌ అలాగే చంద్రబాబును అనుసరించడమే తన రాజకీయ ధ్యేయంగా వ్యవహరిస్తున్నాడని. తాను జగన్‌ రెడ్డి అనే పిలుస్తానని పవన్ అంటున్నాడని,ఆయన పిలిచినా పిలవక పోయినా రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని అనిల్‌ గుర్తు చేశారు. ఓ పక్క చంద్రబాబు మతి స్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, ఆయనను ఫాలో అయ్యే పవన్‌ కూడా జగన్‌కు దమ్మూ, ధైర్యం లేదని మాట్లాడడం విడ్డురంగా ఉందని సోనియానే ఎదిరించిన పోరాడిన జగన్‌ దమ్మూ, ధైర్యం ఏపాటిదో ప్రజలందరికీ తెలుసన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమ సస్యశ్యామలంగా ఉంటే దానిని సైతం పవన్ చూడలేపోతున్నాడని.

 

కులమతాలకు అతీతంగా పని చేస్తున్న సీఎంను పట్టుకుని క్రిస్టియన్‌ అంటున్నాడని నా మతం మానవత్వం… నా కులం మాట నిలబెట్టుకునే కులం…అని జగన్‌ స్పష్టంగా చెప్పారన్న విషయాన్ని గుర్తుచేసుకోవలని పవన్ కళ్యాణ్ వాస్తవాలను తెలుసుకుని మాట్లాడలంటూ మండిపడ్డారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat