వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన పవన్ స్పీచ్ పై మండిపడుతున్నారు. కొందరైతే పవన్ కి మతిస్తిమితమే లేదని అంటున్నారు. ఇక తాజా విషయానికి వస్తే విజయసాయి రెడ్డి “ఎలక్షన్లలో ప్రజలు పొర్లించి కొట్టినంత పనిచేసినా సిగ్గుపడకుండా దులిపేసుకున్నాడు. యాక్టరును చూద్దామని నలుగురు పోగవగానే రెచ్చిపోయి డైలాగులు వదుల్తున్నాడు. రాజకీయాలంటే ప్యాకేజి కోసం అమ్ముడు పోవడం కాదు. ఎవరో ఉస్కో అంటే కాసేపు మొరిగి వెళ్లిపోవడం అంతకంటే కాదు” అని అన్నారు.