Home / TELANGANA / దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మంత్రి తలసాని స్పందన..!

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మంత్రి తలసాని స్పందన..!

డిసెంబర్ 6 , శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద దిశ కేసులోని నలుగురు నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించారు. నిజానికి దిశ హత్యాకాండ జరిగిన దగ్గర నుంచి తెలంగాణ పోలీసులు, సీఎం కేసీఆర్ తీరుపై జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినా లెక్క చేయక ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయింది. కాగా తాజాగా జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌ పట్ల యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినేతలు, కేంద్ర మంత్రులు, ముఖ్యనేతలదగ్గర నుంచి సామాన్యుల వరకూ ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్‌ను, తెలంగాణ పోలీసులను పెద్ద ఎత్తున అభినందిస్తున్నారు. యుపీ పోలీసులు తెలంగాణ పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలని బీఎస్పీ అధినేత మాయావతి కూడా సూచించారు.  దిశ ఘటనలో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంతో దేశం నలుమూల నుంచి హర్షం వ్యక్తమవుతున్న నేపధ్యంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్పందించారు. సీఎం కేసీఆర్‌ మౌనంగా ఉన్నారంటే ఉగ్రరూపం చూపబోతున్నారని అర్ధమని తలసాని. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టినిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. దిశ కుటుంబాన్ని పరామర్శించలేదని అన్న వారే నేడు ఆయనకు జేజేలు కొడుతున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలే కాదు మహిళల రక్షణలో తెలంగాణ ప్రభుత్వం ప్రధమస్థానంలో నిలిచిందని మంత్రి తలసాని అన్నారు. అలాగే మంత్రి కుమారుడు, టీఆర్‌ఎస్‌ యువనేత, సికింద్రాబాద్‌పార్లమెంట్‌నియోజకవర్గం ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్‌ మాట్లాడుతూ మహిళలు, విద్యార్ధినుల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారికి ఇదో హెచ్చరిక వంటిదని అన్నారు. దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయటం పట్ల దేశం యావత్తూ హర్షిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం దేశానికే ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. సాహసోపేత నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.మొత్తంగా దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ పట్ల తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat