Home / 18+ / జయలలిత బయోపిక్ వెబ్ సిరీస్ లో రమ్యకృష్ణ, కంగనా, నిత్యామీనన్..!

జయలలిత బయోపిక్ వెబ్ సిరీస్ లో రమ్యకృష్ణ, కంగనా, నిత్యామీనన్..!

తమిళనాట వెబ్ సిరీస్ కు కొడవేలేదు.కానీ ఇప్పటివరకు బయోపిక్ ను వెబ్ సిరీస్ గా తెరకెక్కించే సాహసం ఎవ్వరు చేయలేదు. ఈ ట్రెండ్ ను గౌతమ్ మీనన్ మొదలు పెట్టబోతున్నాడు. జయలలిత చనిపోయిన మూడేళ్ల తర్వాత వరసగా అంతా ఆమె బయోపిక్స్ చేస్తున్నారు. తమిళనాట ఇప్పుడు ఈమె జీవితంపై మూడు బయోపిక్స్ తెరకెక్కనున్నాయి. అందులో కంగన రనౌత్ ప్రధాన పాత్రలో ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న తలైవి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.అయితే రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో గౌతమ్ మీనన్ క్వీన్ అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కించాడు. మొత్తం 14 ఎపిసోడ్స్ ఇందులో ఉంటాయి. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదని అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే మొన్న విడుదలైన తలైవి టీజర్ కంటే ఇది అద్భుతంగా ఉందంటూ వార్తలు వస్తున్నాయి. రమ్యకృష్ణ జయలలిత పాత్రలో ఇండిపోయిందనే చెప్పాలి.

తమిళనాట జయలలిత ఓ సినీ నటిగా.. పార్టీ అధినేత్రిగా.. ఓ ముఖ్యమంత్రిగా.. ఓ ఐరన్ లేడీగా.. ఇలా ఒక్కటేంటి ఇండియాలో బహుశా మరే లేడీకి సాధ్యం కాని రీతిలో చరిత్ర సృష్టించింది అమ్మ. ఈమె చరిత్రను క్యాష్ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. 2016 డిసెంబర్‌లో జయలలిత అనారోగ్యంతో కన్నుమూసారు. ఆమె మరణం కూడా ఇప్పటికీ ఒక మిస్టరీయే.నిత్యామీనన్ ప్రధాన పాత్రలో ది ఐరన్ లేడీ అనే సినిమా కూడా వస్తుంది.ఇప్పుడు రమ్యకృష్ణ క్వీన్ వెబ్ సిరీస్ కూడా వస్తుంది. జయ చిన్ననాటి జీవితం నుంచి మొదలుపెట్టి.. ఆమె స్కూల్ జీవితం.. ఎదిగిన విధానం.. ఆ తర్వాత సినిమాలు.. ఎంజీఆర్‌తో పరిచయం.. సినిమాల్లో స్టార్ డమ్.. ఎంజీఆర్‌ మరణం తర్వాత పార్టీ పగ్గాలు తీసుకున్న విధానం అన్నీ చూపించాడు గౌతమ్ మీనన్. టీజర్ చూస్తుంటే ఈ వెబ్ సిరీస్ సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. డిసెంబర్ 14న విడుదల కానుంది.ఈ వెబ్ సిరీస్‌ను మురుగేశన్ అనే దర్శకుడితో కలిసి గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ దెబ్బకు జయలలిత బయోపిక్ తీస్తున్న సినీ దర్శకులకు భయం మొదలైందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat