దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటనలో నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేయడంపై భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హర్షం వ్యక్తం చేశాడు. భవిష్యత్‌లో ఎవరూ ఈ తరహా ఆకృత్యాల గురించి ధైర్యం చేయకుండా ఉండాలంటే ఇదే సరైనదని పేర్కొన్నాడు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను, తెలంగాణ పోలీసుల్ని హర్భజన్ సింగ్ అభినందించాడు. ‘ వెల్‌డన్ తెలంగాణ సీఎం- వెల్‌డన్ తెలంగాణ పోలీస్. మీరు ఏదైతే చేశారో అది కచ్చితంగా అభినందనీయమే’ అని హర్భజన్ పేర్కొన్నాడు.
Well done @TelanganaCMO and police for showing this is how it is done ✅ no one should dare doing something like this again in future #makeitsafeindia https://t.co/g8uDNiCCn6
— Harbhajan Turbanator (@harbhajan_singh) December 6, 2019
దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై దేశవ్యాప్తంగా సంబురాలు జరుపుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం ఈ ఘటనపై హర్షం వ్యక్తం చేస్తోంది. టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుంటు సంతోషం తెలుపుతున్నారు. మరోవైపు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘సాహో సజ్జనార్… శభాష్ సజ్జనార్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దిశపై అత్యాచారం చేసి, హతమార్చిన నలుగురు నిందితులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌లో హతమైన సంగతి తెలిసిందే. నిందితులను సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా విచారణ జరుపుతున్నప్పుడు పోలీసులుపై దాడి చేశారని, తప్పించుకుని పారిపోతుండగా, పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.