Home / TELANGANA / మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్..!!

మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్..!!

ఆర్టీసీ సమ్మె అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన ఒక్కో హామీ నెరవేరుతోంది. ముందుగా.. సమ్మె కాలంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాలకు సంబంధించి సెప్టెంబర్‌ నెల జీతాలను విడుదల చేసిన ప్రభుత్వం.. తాజాగా.. ఆర్టీసీలో 240 రోజులు తాత్కాలికంగా విధులు నిర్వర్తించిన 296 మంది డ్రైవర్లు, 63 మంది కండక్టర్లను ఆర్టీసీ యాజమాన్యం రెగ్యులరైజ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం పట్ల రెగ్యులరైజైన ఉద్యోగులు ఆర్టీసీ యాజమాన్యానికి, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు సీఎంకు రుణపడి ఉంటామని తెలిపారు.