Home / ANDHRAPRADESH / నిన్న ఉల్లి ఎపిసోడ్‌…ఇవాళ గడ్డిమోపుల ఎపిసోడ్ అదిరిందయ్యా చంద్రం..నీ డైలీ సీరియల్..!

నిన్న ఉల్లి ఎపిసోడ్‌…ఇవాళ గడ్డిమోపుల ఎపిసోడ్ అదిరిందయ్యా చంద్రం..నీ డైలీ సీరియల్..!

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు చేయిస్తున్న డ్రామాలు హాస్యాస్పదంగా మారుతున్నాయి. నిన్న తొలిరోజు ఉల్లి ధరలు కొండెక్కాయంటూ..బాబు, లోకేష్‌లతో సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా ఉల్లిగడ్డల దండలు వేసుకుని అసెంబ్లీ వరకు ర్యాలీగా వచ్చి ఉల్లి ధరలపై సిల్లీ డ్రామాలు ఆడారు. వాస్తవానికి దేశమంతటా ఉల్లిధరలు కొండెక్కాయి…ఉల్లిధరలు ఆకాశాన్ని తాకుతుంటే కేంద్రంలోని మోదీ సర్కార్ చోద్యం చూస్తుంది. ఈ ఉల్లిధరల తగ్గింపు రాష్ట్రాల చేతిలో లేదు. అయినా దేశంలో అన్ని రాష్ట్రాలలో కంటే ఏపీలో జగన్ సర్కార్ ప్రజలకు కేవలం 25 రూపాయలకే కిలో ఉల్లిగడ్డలు అందిస్తోంది. ఈ నిజం తెలిసి కూడా చంద్రబాబు కేవలం రాజకీయం చేయడం కోసం ఉల్లిపై లొల్లి చేయించాడు.. ఏపీలో కిలో ఉల్లిగడ్డ 200 దాటిందంటూ..అసమర్థ ప్రభుత్వం అంటూ తనదైన స్టైల్లో రంకెలు వేశాడు. అయితే ఎంతసేపు ఉల్లిధరలు పెరిగాయంటూ సీఎం జగన్‌ను ఆడిపోసుకోవడం తప్ప..కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని పల్లెత్తు మాట అనే ధైర్యం చంద్రబాబుకు లేదు..ఎందుకంటే ఎక్కడ మోదీగారికి కోపం వస్తే..తాను కేసుల్లో జైలుకు పోవాల్సి వస్తుందనే భయం కాబోలు. ఇక ఈ ఉల్లి ఎపిసోడ్‌లో కొసమెరుపు ఏంటంటే స్వయానా బాబుగారి హెరిటేజ్ మార్కెట్‌లో కూడా కిలో ఉల్లిగడ్డ 200 కు పైగా అమ్మడం…ఇదే విషయాన్ని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారు కూడా. అయితే హెరిటేజ్ గ్రూపు ఫ్యూచర్ గ్రూపు టేకోవర్ చేసిన విషయం సీఎం జగన్‌కు తెలియదని టీడీపీ కౌంటర్ ఇచ్చింది. కాకపోతే హెరిటేజ్‌ను ఫ్యూచర్ గ్రూపు టేకోవర్ చేసినా..అందులో ఇంకా బాబుగారికి 10 శాతం ఉండడం గమనార్హం. ప్రజల మీద ప్రేమ ఉంటే చంద్రబాబు తన హెరిటేజ్ మార్కెట్లలో కేజీ ఉల్లిగడ్డ రూ. 25/- కు కాకపోయినా కనీసం 60 -70 రూపాయలకు అయినా అందించగలిగేవాడు. కాని బాబుగారికి రాజకీయం తప్పా..ప్రజల గురించి ధ్యాస ఉండదు కదా..

ఇక నిన్న బాబుగారి ఉల్లి ఎపిసోడ్ సిల్లీగా మారితే..ఇవాళ మరో ఎపిసోడ్ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ ఈరోజు ఉదయం అసెంబ్లీ వద్ద టీడీపీ ఎమ్మెల్లేలు, ఎమ్మెల్సీలు వరి కంకులు, మొక్క జొన్న పొత్తులతో నిరసన ప్రదర్శన చేసారు. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు అయితే నెత్తిన గడ్డిమోపులు పెట్టుకుని మరీ ఫోటోలకు ఫోటోలు ఇచ్చారు. బాబుగారు అలా గడ్డిమోపు ఎత్తుకున్నట్లు ఫోజులు ఇచ్చారు కాని..వంటికి ఎలర్జీ వస్తుందనుకున్నాడేమో నెత్తిన మాత్రం పెట్టుకోలేదు. కాగా రైతులు పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు జగన్ సర్కార్ చిత్తశుద్ధితో పని చేస్తోంది. రాష్ట్రమంతటా ఉల్లిగడ్డలను రైతుబజార్లలో కేజీ 25 రూపాయలకే అందించాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులు పండించిన పంటలకు ముందే తగిన గిట్టుబాటు ధర లభించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు గత టీడీపీ ప్రభుత్వం బకాయి పెట్టిన రూ. 960 కోట్లను కూడా వైసీపీ సర్కార్ చెల్లించింది. ఇలా రైతన్నలు పండించిన పంటలకు మద్దతు ధరలు అందించేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తుంటే..ఇలా చంద్రబాబు రోజుకో ఎపిసోడ్‌తో డ్రామా పండిస్తున్నాడు. బాబుగారి డైలీ ఎపిసోడ్‌లపై నెట్‌జన్లు స్పందిస్తున్నారు. రాజధానిపేరుతో భూములు ఇవ్వని రైతుల పొలాలను, అరటితోటలను తగలబెట్టించిన చంద్రబాబు ఇప్పుడు రైతులకు మద్దతు ధరలు అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడంటూ ఒక నెట్‌జన్ మండిపడ్డాడు. ఒకప్పుడు కరెంట్ చార్జీలు తగ్గించాలని ఆందోళన చేస్తున్న అమాయక రైతులను తుపాకులతో కాల్చి చంపించిన ఆ చేత్తో గడ్డిమోపులు ఎత్తుడేందీ బాబయ్యా అంటూ మరొక నెట్‌జన్ సెటైర్ వేశాడు. ఒకప్పుడు వ్యవసాయం దండగ అన్న ఆ నోటితో పంటకు గిట్టుబాటు ధరలు కల్పించమని నినాదాలు చేసుడేంది బాబయ్యా అంటూ ఇంకో నెట్‌జన్ చమత్కరించాడు. మొత్తానికి నిన్న ఉల్లి..ఇవాళ గడ్డిమోపులు..ఇలా రోజుకో ఎపిసోడ్‌తో అదిరిందయ్యా చంద్రం..నీ డైలీ సీరియల్ అంటూ..నెట్‌జన్లు తెగ సెటైర్లు వేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat