Home / POLITICS / నీలి విప్లవానికి మద్య మానేరు ను కేంద్ర బిందువుగా తీర్చిదిద్దాలి..మంత్రి కేటీఆర్

నీలి విప్లవానికి మద్య మానేరు ను కేంద్ర బిందువుగా తీర్చిదిద్దాలి..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర జల కూడలి గా మారిన మధ్య మానేరు జలాశయంను నీలి విప్లవానికి కేంద్రబిందువుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రి  కే తారకరామారావు అధికారులకు సూచించారు. బుధవారం హైదరాబాద్ ప్రగతిభవన్ లో సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి పై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి రాష్ట్ర మంత్రి తారక రామారావు అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం రాజన్న సిరిసిల్ల అభివృద్ధిపై సిరిసిల్ల నియోజకవర్గ జెడ్పీటీసీలు, ఎంపీపీలు ,జిల్లా అధికారులకు పలు సూచనలు మార్గదర్శనం చేశారు.

మద్య మానేరు జలాశయం తీరం వెంబడి పర్యాటకం , ఫిషెరీస్, ఆక్వా హబ్ గా తీర్చిదిద్దేందుకు 150 ఎకరాల అనువైన స్థలం ఈ నెలాఖరులోగా గుర్తించాలని రెవెన్యూ, మత్స్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నీటి, రోడ్డు సౌకర్యం ఉండేలా స్థల గుర్తింపు చేపట్టాలన్నారు. పాపికొండలు మాదిరి పర్యాటక ప్రదేశంగా మద్య మానేరు జలాశయం తీర్చిదిద్దాలన్నారు. కేరళ మాదిరి హౌస్ బోటింగ్ సౌకర్యం ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేయాలన్నారు. టూరిజం అంశాలకు సంబంధించి బోటింగ్, ఊగే ఊయల, గార్డెనింగ్ తదితర సౌకర్యాలను పర్యాటకుల సౌకర్యార్థం కల్పించాలన్నారు. హరిత హోటల్ నిర్మాణం చేపట్టాలన్నారు . రామప్ప గుట్టలపై సువిశాలమైన స్థలంలో సుందరంగా అతిథి గృహం నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. హైదరాబాద్ నుంచి సిరిసిల్ల పట్టణంకు రెండున్నర గంటల వ్యవధిలో పర్యాటకులు చేరుకునే అవకాశం ఉన్న దృష్ట్యా వీకెండ్ టూరిజం స్పాట్ గా మద్య మానేరు జలాశయం తీర్చిదిద్దాలన్నారు. 30 రోజుల ప్రణాళిక స్ఫూర్తిని నిరంతరం కొనసాగించేందుకు గ్రామాలలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు వీలుగా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అన్నారు. కానీ సిరిసిల్ల నియోజకవర్గంలో ఇప్పటివరకు 35 ట్రాక్టర్లు మాత్రమే కొనుగోలు చేశారని మంత్రి అన్నారు. మిగతా గ్రామపంచాయతీలు సత్వరమే ట్రాక్టర్ లను కొనుగోలు చేసేలా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. రానున్న ఐదు రోజుల్లో గ్రామపంచాయతీలు ట్రాక్టర్ల కొనుగోలుకు ముందుకు రాని పక్షంలో జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులు స్వయంగా ట్రాక్టర్లను కొనుగోలు చేసి పంచాయతీలకు అందించాలని మంత్రి స్పష్టం చేశారు.

గ్రామ పంచాయతీలలో లో పారిశుధ్యం మెరుగు పరిచేందుకు , పచ్చదనం ను పెంపొందించేందుకు 30 రోజుల ప్రణాళిక లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి నోడల్ అధికారులను నియమించామని అన్నారు. వారు తరచుగా గ్రామాలను సందర్శిం చేలా చూడాలని జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు. జిల్లాలో 100% ఇంకుడు గుంతల నిర్మాణం లక్ష్యంగా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు మొత్తం 47 వేల 241 ఇంకుడు గుంతల కు గాను కేవలం 12721 ఇంకుడు గుంతలను మాత్రమే నిర్మించడం జరిగిందన్నారు. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో వచ్చే సంక్రాంతి కళ కల్లా ప్రతి గ్రామంలో 100% ఇంకుడు గుంతల నిర్మాణం లక్ష్యంగా అధికారులు పనిచేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. ఇంకుడు గుంతల నిర్మాణం లో స్థానిక జెడ్పిటిసి ఎంపీపీ ఇతర ప్రజాప్రతినిధులు పోటీపడాలి అన్నారు. మొదటగా ప్రజా ప్రతినిధులు తమ సొంత గ్రామంలో 100% ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండో దఫా ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి తాను నేటికీ ఒక సంవత్సరం అవుతుంది అన్నారు.

ప్రస్తుతం మధ్య మానేరు జలాశయం నిండి మానేరు నది లో సిరిసిల్ల వరకు మీరు సముద్రం మాదిరి పరుచుకొని ఉంది అన్నారు. సాగునీరు సమృద్దిగా అందించాలనే తమ లక్ష్యం సాకారం అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. నిండు కుండల మారిన జలాశయం బ్యాక్ వాటర్ ను చూసి సిరిసిల్ల జిల్లా ప్రజలు సంతోష పడుతున్నారని మంత్రి అన్నారు. ప్రజలు తమ జీవితాలు బాగుపడతాయని భావిస్తున్నారని పేర్కొన్నారు మధ్య మానేరు జలాశయం 99శాతం ఇప్పటికే పూర్తయింది అన్నారు అలాగే జిల్లాలో చేపట్టిన ప్యాకేజీ9,10, 11 ,12ల ద్వారా సిరిసిల్ల జిల్లాలోని 666 చెరువులను నింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు

సాగునీరు సమృద్ధిగా లభించే ఉన్న దృష్ట్యా సాగునీటిని సద్వినియోగం పై మండలాల వారీగా ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి ప్రజాప్రతినిధులకు సూచించారు. సాగునీటి సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు .అలాగే ప్రజలను చైతన్యం చేసేందుకు నియోజకవర్గం మండలం గ్రామాల వారిగా అధికారుల సహాయంతో ప్రజా ప్రతినిధులు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు . రైతు సమన్వయ సమితి లను సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గం మండలానికి సంబంధించిన వాటర్ మ్యాపులను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో లో సాయి ల్ ప్రొఫైల్ సిద్ధం చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక వ్యవసాయ ఉత్పత్తులు 5 రేట్లు పెరిగాయి అని మంత్రి గుర్తు చేశారు. జిల్లాలో ప్రధానంగా ప్రతి వరి , మొక్కజొన్న పంటలను మాత్రమే రైతులు సాగు చేస్తున్నారని అన్నారు. రేపు పుష్కలంగా సాగునీటి లభించిన తర్వాత రైతులందరూ ఇవే పంటలను సాగు చేస్తే వ్యవసాయ ఉత్పత్తులు కు సరైన గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించడం కష్టంగా మారుతుంద న్నారు. ఇలాంటి పరిస్థితి ఇప్పటికే పలు రాష్ట్రాల్లో చూస్తున్నామని మంత్రి తెలిపారు.

కావున ప్రజా ప్రతినిధులు అధికారులు రైతులను ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. రైతుల మూ డ్ చేంజ్ చేసేలా స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రీన్ హౌస్ పాలీహౌస్ ప్రత్యామ్నాయ పంటల ప్రయోగాలు చేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.
సాయిల్ ని బట్టి క్రాప్ కాలనీల కింద ప్రత్యామ్నాయ పంటలు ఎలా సాగు చేయవచ్చు ప్రత్యామ్నాయ పంటల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు వివరిస్తూ వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు ప్రజెంటేషన్ సిద్ధం చేయాలని మంత్రి సూచించారు.
శిక్షణ కార్యక్రమాలలో వీటిని ప్రదర్శించి రైతులను చైతన్యం చేయాలన్నారు. పౌల్ట్రీ డైరీ మత్స్యశాఖ రంగాలలో స్వయం సమృద్ధి సాధిస్తే మాంస పరిశ్రమలు పెట్టి స్థానిక యువత కు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు ఆ దిశగా రైతులను చైతన్యవంతం చేసే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు దే అన్నారు . elected ప్రజా ప్రతినిధులు లు, సెలెక్టెడ్ అధికారులు కలిసి సమన్వయంతో పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు మంత్రి తెలిపారు. అనంతరం మిషన్ భగీరథ ప్రగతిపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించిన మంత్రి జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి నల్ల ద్వారా రక్షిత త్రాగు నీరు అందించాలని ఆదేశించారు. భగీరథ త్రాగునీరు మురికిగా వస్తున్నాయని పలువురు ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకురాగా భగీరథ వాటర్ నాణ్యతను ల్యాబ్ ద్వారా ఎప్పటికప్పుడు పరీక్షించాలని అన్నారు. భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్ల ద్వారా త్రాగు నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ఇప్పటికీ గ్రామాలలో మినరల్ వాటర్ ప్లాంట్ నీటిని ప్రజలు ఉపయోగిస్తూ ఉండడం గర్హనీయం అన్నారు.

మినరల్ వాటర్ కంటే భగీరథ నీరు ఎందుకు మెరుగైన దో ప్రజలకు వివరించాలన్నారు. ముందు అధికారులు మిషన్ భగీరథ వాటర్ ను త్రాగి ప్రజలు భగీరథ వాటర్ ను తాగేలా చైతన్య పరిచాలని అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో మిషన్ భగీరథ వాటర్ వినియోగించుకునేలా చూడాలన్నారు గ్రామాలలో సాని టే షన్ , వాటర్ కమిటీలను బలోపేతం చేయాల న్నారు. నీటి వనరుల సంరక్షణ ఇంకుడు గుంతల నిర్మాణం లో ఈ కమిటీలను క్రియాశీలక భాగస్వామ్యం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.
అలాగే సిరిసిల్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో డంపింగ్ యార్డులు కంపోస్టు యార్డు షెడ్ల నిర్మాణం ఉండేలా జాగ్రత్తపడాలి అన్నారు. అలాగే ప్రతి గ్రామంలో వైకుంఠ గ్రామాలు ఉండేలా చూడాలన్నారు. పనులు ప్రారంభం నెమ్మదిగా సాగుతున్న పనులకు సంబంధించిన వివరాలను జడ్పిటిసి ఎంపీపీ ఇవ్వాలన్నారు. జిల్లాలో 666 చెరువులు నింపేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మధ్య మానేరు జలాశయం నుండి ఈ చెరువులలో 6.6 tmc నీటిని నింపే వెసులుబాటు ఉందన్నారు.
ఒక్క tmc నీటి తో 10 వేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించవచ్చు అన్నారు . అలాగే సిరిసిల్ల నియోజకవర్గంలో చేపట్టిన మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం 666 చెరువులకు 372 చెరువులను గ్రావిటీ ద్వారా నింపవచ్చు అన్నారు ఫలితంగా 83 శాతం ఆయకట్టు సాగునీరు అందుతుందన్నారు జిల్లాలోని చెరువులు నింపితే 23 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ తోపాటు కొత్తగా 1,37,300 ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. స్పందించిన మంత్రి ప్యాకేజీ ప్యాకేజీ 9,10,11, 12 పనులను జూన్ 2 కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పనులు పూర్తయితే ప్రస్తుత సాగునీటి సౌకర్యం కంటే ఐదు రెట్లు ఎక్కువగా సాగునీటి రంగానికి నీటి సౌకర్యం కల్పించిన ఘనత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు . అలాగే సాగునీటిని సద్వినియోగం పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అనంతరం రహదారులు భవనాల శాఖ సమీక్షించిన మంత్రి ఇప్పటికే మంజూరు చేసిన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ఆదేశించారు .
ఉపాధి హామీ పథకం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మల్టీపర్పస్ రోడ్లను చేపట్టాలన్నారు. జిల్లె ల్ల – ముస్తాబాడ్, దుబ్బాక – ముస్తా బాద్ రోడ్డు పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల న్నారు.

అనంతరం మంత్రి జిల్లాలో చేపట్టనున్న రైల్వే ట్రాక్ స్టేషన్ ఏరియా భూసేకరణపై రెవెన్యూ సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో చర్చించారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే 15 రోజుల్లో రైల్వే స్టేషన్ స్థలం ఖరారు చేయాలని అధికారులకు సూచించారు. రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి రైల్వే స్టేషన్లు సంఖ్యను ఫైనలైజ్ చేయాలన్నారు. అటు పిమ్మట మంత్రి ఇ సిరిసిల్ల నియోజకవర్గంలో రెండు పడక గదుల నిర్మాణం ప్రగతిపై సమీక్షించారు సిరిసిల్ల నియోజకవర్గంలో మొత్తం మంజూరైన 3146 లకు గానూ మూడు వేల ఇల్లు పనులు ప్రారంభం కావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. అన్ని రెండు పడక గదుల ఇళ్ల సైట్లలో కనీస మౌలిక వసతులు ఉండేలా అధికారులు జాగ్రత్తపడాలి అన్నారు. రెండు పడక గదుల నిర్మాణం ప్రారంభం సమయం ఎప్పుడు తెలిపే ప్రత్యేక క్యాలెండరు రూపొందించాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టేలా అధికారులు పగడ్బందీ కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు. ప్రజల సమక్షంలోనే డ్రా తీయాలన్నా రు . ఇల్లు లేని వారికి మాత్రమే పడక గదుల కేటాయింపు చూడాలన్నారు. రెండు పడక గదుల కేటాయింపు లో స్థానిక ప్రజా ప్రతినిధులు ఎలాంటి జోక్యం చేసుకోవద్దని మంత్రి స్పష్టం చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు ఉండేలా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని మంత్రి సూచించారు మెరుగైన తరగతి గదులు, ప్ర వారి గోడ వంట గదులు మరుగుదొడ్లు పిల్లలు సౌకర్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు పాఠశాలకు రన్నింగ్ వాటర్ సౌకర్యం డైనింగ్ హాల్ ఉండేలా చూడాలన్నారు వసతి గృహాల్లో లీటర్లు దుప్పటి సౌకర్యం ఉండేలా చూడాలన్నారు. వీటిని సమకూర్చేందుకు సిఎస్ఆర్ ఫండ్ నుంచి నిధులు అందిస్తామన్నారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కోసం 20 కోట్ల నుంచి 25 కోట్ల వరకు సీఎస్ఆర్ కింద నిధులు అందిస్తామన్నారు .సిరిసిల్ల నియోజకవర్గం స్కూల్ ఎడ్యుకేషన్ లో రాష్ట్రానికే నమూనాగా తీర్చిదిద్దాలన్నారు. అలాగే పట్టణంలో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల భవనం వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం కల్లా సిద్ధం చేయాలన్నారు. సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం వచ్చే సంక్రాంతికి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు వచ్చే జనవరి నెలాఖరులోగా గంభీరావుపేట నుండి తంగళ్ళపల్లి వరకు గల మానేరు నది తీరం వెంబడి 37.5 కిలోమీటర్ల మేర మొక్కలు నాటే నాటేందుకు కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు.

మద్య మానేరు కరకట్ట ను 60 ఫీట్ల కు పెంచాలన్నారు. కరకట్ట సాయి నగర్ వరకు విస్తరించి ఉన్నారు ప్రస్తుతం ఉన్న తంగళ్ళపల్లి బ్రిడ్జికి సమాంతరంగా ఉన్న మరో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ మండల అధికారి శ్రీ శ్రీనివాస రావు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య , కార్యనిర్వాహక ఇంజనీర్ లు విగ్నేశ్వర రెడ్డి శ్రీ శ్రీనివాస రెడ్డి, ప్ శ్రీ అమరేందర్ రెడ్డి జిల్లా పంచాయతీ అధికారి ఇ రవీందర్ డి ఆర్ డి ఓ కౌటిల్య రెడ్డి ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat