Home / ANDHRAPRADESH / ఎల్లోమీడియాకు, బాబుకు కలిపి గడ్డిపెట్టిన సీఎం జగన్..!

ఎల్లోమీడియాకు, బాబుకు కలిపి గడ్డిపెట్టిన సీఎం జగన్..!

టీడీపీ అధినేత చంద్రబాబు గారి ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం గురించి చెప్పన్కర్లేదు..ఇంగ్లీషు‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడడం రాకపోయినా..అనవసర బిల్డప్ కోసం తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడుతూ..బాబుగారు నవ్వులపాలవుతుంటారు. వాట్ ఐయామ్ సేయింగ్..మా వాళ్లు బ్రీఫ్డ్‌మీ..మోదీ గివ్ మట్టీ నీళ్లు…ఇలాంటి ఆణిముత్యాలు బాబుగారి నోట అలవోకగా జారుతుంటాయి. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మావాళ్లు బ్రీఫ్డ్‌మీ అంటూ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడు..ఆ సమయంలో ఆ వాయిస్ ఫ్యాబ్రికేటేడ్ అంటూ చంద్రబాబు బుకాయిస్తే.. మా వాళ్లు బ్రీఫ్డ్‌మీ అంటూ అంత దరిద్రమైన ఇంగ్లీష్ మాట్లాడేది దేశంలో చంద్రబాబు తప్పా..ఇంకో నాయకుడు ఉండడని..తెలంగాణ మినిష్టర్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. అయినా బాబుగారు తన ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు. తాజాగా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఇంగ్లీష్‌‌ రాదని తేలిపోయింది. ప్రభుత్వంపై బురద జల్లే ఎల్లోమీడియా దురుద్దేశపూరిత కథనాలను కట్టడి చేయడానికి జగన్ సర్కార్ జీవో 2430 ను తీసుకువచ్చింది. ఈ జీవోపై చంద్రబాబు రెచ్చిపోయాడు. మీడియాపై ఆంక్షలంటూ…నల్లరిబ్లన్లు కట్టుకుని ఆందోళన చేస్తున్న చంద్రబాబును మార్షల్స్ అడ్డుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎల్లోమీడియా ఛానళ్ల తప్పుడు వార్తలపై ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 2430పై చంద్రబాబు ప్రశ్నించాడు. దీంతో సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా ఎల్లోమీడియాను, చంద్రబాబును కడిగిపారేశారు. అసలు జీవో నంబర్ 2430‌ను అసలు చంద్రబాబు చదివారా..అందులో ఏం తప్పుంది అని జగన్ ప్రశ్నించారు. అసలు చంద్రబాబుకు ఇంగ్లీష్ రాక..జీవోను అర్థం చేసుకోలేక వ్యతిరేకిస్తున్నారంటూ జగన్ అన్నారు. ఈ సందర్భంగా జీవోను మొత్తం జగన్ సభకు చదివి వినిపించారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని తప్పుడు కథనాలు రాసే వారికే ఈ జీవో వల్ల ఇబ్బంది తప్పా..ఇందులో చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటని జగన్ అడిగారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు చంద్రబాబును భుజానా వేసుకుని, తమపై ఎంత బురద జల్లినా…మేం చూస్తూ వూరుకోవాలా…ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తే మేం పడాలా అంటూ సీఎం జగన్ నిలదీశారు. ఆధారాలు లేకుండా..నిందలు, ఆరోపణలతో అసత్యకథనాలు ప్రచురిస్తే ప్రభుత్వం వాటిని భరించాలా..మా హక్కులకు భంగం కలిగితే ప్రశ్నించకూడదా..పరువు నష్టం వేసే హక్కు కూడా లేదా అంటూ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇంగ్లీష్‌ రాక జీవోను అర్థం చేసుకోక…గుడ్డిగా వ్యతిరేకిస్తే..మేం చేయాలని జగన్ చురకలు అంటించారు. మొత్తంగా ఏపీ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఇంగ్లీష్‌లో సరిగా మాట్లాడలేడనే విషయమే కాకుండా..సరిగా అర్థం కూడా చేసుకోలేడని..తేలిపోయింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat