తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద విషాదం నెలకొన్నది. సీనియర్ నటుడు.. రచయిత.. అయిన గొల్లపూడి మారుతీరావు ఈ రోజు మృతిచెందారు.
ఆయన మొదట ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మనిషికో చరిత్ర,యముడికి మొగుడు,సంసారం ఒక చదరంగం ,స్వాతిముత్యం ,గూఢాచారి నెం1 లాంటి ఎన్నో విజయవంతమైన మూవీల్లో నటించారు.
ఆయన నాలుగు తరాల హీరోల మూవీలో నటించారు. దాదాపు రెండు వందల తొంబైకి పైగా సినిమాల్లో నటించారు.1983లో ఉత్తమ హాస్య నటుడిగా తరంగిణి మూవీకి మొదటిసారి ఆయన నంది అవార్డును సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఆయన మొత్తం ఆరు నంది అవార్డులను సొంతం చేసుకున్నాడు…